JNU Delhi: ఆ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను వెంటనే ఆపేయండి.. విద్యార్థులకు సర్క్యూలర్ జారీ చేసిన జేఎన్‌యూ అధికారులు..
JNU Delhi: జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు తలపెట్టిన 'రామ్ కే నామ్' డ్యాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై సర్క్యూలర్..
JNU Delhi: జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు తలపెట్టిన ‘రామ్ కే నామ్’ డ్యాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై సర్క్యూలర్ జారీ చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ సంతకంతో ఉన్న ఈ సర్క్యూలర్‌లో.. డాక్యుమెంటరీ ప్రదర్శనకు సంబంధించిన ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని, ఈ కారణంగా ప్రదర్శనను నిలిపివేయాల్సిందగా ఆదేశాలను జారీ చేశారు. కొంత మంది విద్యార్థులు ‘రామ్ కే నామ్’ పేరుతో ఉన్న డ్యాక్యుమెంటరీ మూవీని వర్సిటీ ప్రాంగణంలో ప్రదర్శన చేస్తున్నట్లు.. కొన్ని పాంపెట్లను విడుదల చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి అనధికారిక కార్యకలాపాలు యూనివర్సిటీ క్యాంపస్‌లో మత సామరస్యానికి భంగం కలిగించవచ్చని సర్క్యూలర్‌లో ప్రస్తావించారు. అయితే దీనికి స్పందించిన వర్సిటీకి చెందిన విద్యార్థి ఒకరు ట్వీట్ చేస్తూ.. ‘రామ్ కే నామ్ చిత్రాన్ని చాలా ఏళ్ల నుంచి ప్రదర్శిస్తున్నాం. ఇది ఒక పాత చిత్రం. యూనివర్సిటీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడండి’ అంటూ ట్వీ్‌ట్ చేశారు.
అసలేంటీ డాక్యుమెంటరీ..
ప్రముఖ డ్యాక్యుమెంటరీ ఫిలిమ్ మేకర్ ఆనంద్ పట్వర్ధన్ 1992లో రామ్ కే నామ్ (ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్) పేరుతో ఓ డాక్యుమెంటరీ ఫిలిమ్‌ను రూపొందించారు. 1992లో అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీద్ కూల్చివేత, ఆ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ డ్యాక్యుమెంటరీని తెరకెక్కించారు. అయితే తాజాగా జేఎన్‌యూ అధికారులు ఈ డ్యాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను అడ్డుకోవడంపై విమర్శలు వస్తున్నాయని. వర్సిటీలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతిసేలా అధికారుల చర్యలు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో స్క్రీనింగ్ చేస్తున్న ఈ డ్యాక్యుమెంటరీని ఇప్పుడే కొత్తగా అడ్డుకోవడం ఎంటని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రాచేయొచ్చు.. ఇలా..! వీడియో
పోషకాల పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.. వీడియో