Jayalalitha Properties: అమ్మకానికి జయలలిత చరాస్తులు.. కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలు.. వివరాలివే..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న చరాస్తులు ఒకనాడు సంచలనాత్మకంగా మారాయి. 2003లో జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విక్రయించేందుకు రంగం సిద్ధమైంది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న చరాస్తులు ఒకనాడు సంచలనాత్మకంగా మారాయి. 2003లో జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. అక్రమార్జన కేసులో స్వాధీనం చేసుకున్న జయలలిత చరాస్తుల్ని విక్రయించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అడ్వకేట్ కిరణ్ ఎస్.జావలిని కర్నాటక ప్రభుత్వం నియమించింది.
జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులు ఆ రోజు సంచలనాత్మకంగా మారాయి. భారీ స్థాయిలో నగలు, వజ్రాభరణాలు, వందలాది వెండి వస్తువులు, చెప్పులు సైతం పెద్దమొత్తంలో అధికారులు ఆరోజు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏడు కిలోల బంగారం, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి వస్తువులు,11 వేల చీరలు, 750 జతల చెప్పులు, 91 చేతి గడియారాలు, 131 సూట్ కేసులు, 1040 వీడియో క్యాసెట్లు, ఏ సీలు, ఫ్రిడ్జ్ లు తదితర గృహోపకరణాలు ఉన్నాయి.
జయలలితపై 2003 లో నమోదైన అక్రమార్జన కేసుని గతంలో కర్ణాటక కోర్టుకు బదిలీ చేశారు. కేసు బదిలీ కాడంతో జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను సైతం కర్ణాటకకు తరలించారు. ఇదే కేసులో గతంలో జయలలిత శిక్ష కూడా అనుభవించారు. ప్రస్తుతం జయలలిత ఆస్తులను అమ్మకానికి పెట్టారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
