AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: డబ్బుల పంపకంలో తేడా.. రూ. 300 కోసం సేవకుడిని కొట్టి చంపి..

పూజారికి పని చేస్తున్న వ్యక్తికీ మధ్య ప్రసాదం పంపిణీ విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఆలయంలో భక్తులు ఇచ్చిన కానుకలు  రూ. 700 పని చేస్తున్న వ్యక్తి దగ్గర ఉన్నాయి. ఆ డబ్బుల్లో తనకు రూ.300 ఇవ్వమని పూజారి అడిగినట్లు తెలుస్తోంది. నిందితుడు ఆనంద్ కుమార్ పాండే మహోబా జిల్లా ఖరేలా గ్రామ నివాసి.

Uttar Pradesh: డబ్బుల పంపకంలో తేడా.. రూ. 300 కోసం సేవకుడిని కొట్టి చంపి..
Murder In Jalaun
Surya Kala
|

Updated on: Jul 03, 2023 | 10:01 AM

Share

కోపంలో ఉన్న మనిషి విచక్షణా జ్ఞానాన్ని మరచిపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోక పొతే ఎంతటి దారుణమైన సంఘటన జరగవచ్చు.. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో జరిగిన సంఘటన. కేవలం రూ. 300 ల కోసం ఆలయ పూజారి ఓ సేవకుడిని ఇటుకతో చితకబాది దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఈ మృతదేహాన్ని ఆలయం వెనుక ఉన్న పొలంలో పడేశాడు. ఆ మృతదేహాన్ని కొందరు మహిళా భక్తులు చూసి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడు పూజారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ దారుణ ఘటన జలౌన్‌లోని కడౌరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పూజారికి పని చేస్తున్న వ్యక్తికీ మధ్య ప్రసాదం పంపిణీ విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఆలయంలో భక్తులు ఇచ్చిన కానుకలు  రూ. 700 పని చేస్తున్న వ్యక్తి దగ్గర ఉన్నాయి. ఆ డబ్బుల్లో తనకు రూ.300 ఇవ్వమని పూజారి అడిగినట్లు తెలుస్తోంది. నిందితుడు ఆనంద్ కుమార్ పాండే మహోబా జిల్లా ఖరేలా గ్రామ నివాసి. బఖత్ బాబా ఆలయంలో గత 4 సంవత్సరాలు పూజారిగా ఉన్నారు. ఇదే ఆలయంలో రాజ్ కుమార్ యాదవ్ (30) అనే వ్యక్తి ఆలయాన్ని శుభ్రం చేస్తాడు. రాజ్ కుమార్ బబీనా గ్రామ నివాసి.

మృత దేహాన్ని మొదటగా చూసిన భక్తులు  ఆషాఢమాసంలో దాళ్వా నైవేద్యం పెట్టేందుకు శనివారం మహిళలు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పరిశరాల్లోని పొలంలో రాజ్ కుమార్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ వార్త గ్రామంలో మంటలా వ్యాపించింది. సమాచారం అందుకున్న కల్పి సర్కిల్ డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర పచౌరీ, కడౌరా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ ఫోరెన్సిక్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి సమీపంలో ఉన్న ఆధారాలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. అదే సమయంలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై అధికారి ఏం చెప్పారంటే  సీఓ దేవేంద్ర పచౌరీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయంలో సమర్పించిన సొమ్మును పంచుకునే  విషయంలో వచ్చిన తేడాల నేపథ్యంలో హత్య జరిగింది. ఆలయంలో భక్తులు సమర్పించిన రూ.  700 పంచుకునే విషయంలో తేడాలు వచ్చాయి. ఈ డబ్బులో ఆలయ పూజారి రూ. 300 రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే యువరాజు ఇవ్వలేదు. ఈ ఘటన జరిగిన సమయంలో యువరాజు, ఆలయ పూజారి ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..