Sheep Cost:  కోటికాదు, వెయ్యికోట్లు ఇచ్చినా నా గొర్రెపిల్లను ఇవ్వను.. యజమాని.

Sheep Cost: కోటికాదు, వెయ్యికోట్లు ఇచ్చినా నా గొర్రెపిల్లను ఇవ్వను.. యజమాని.

Anil kumar poka

|

Updated on: Jul 03, 2023 | 9:37 AM

మామూలుగా మేకలు, గొర్రెల ధరలు వేలల్లోనే ఉంటాయి. మేలిమి లాంటి జాతుల వాటికి.. ఇంకా వాటికి ఏమైన ప్రత్యేకతలు ఉంటే లక్షల్లో ధరలు ఉండే అవకాశం ఉంటుంది. మరి ఓ గొర్రెపిల్ల ఏకంగా కోటీ రూపాయల ధర పలికిందంటే నమ్ముతారా? ఒక గొర్రెపిల్లకు కోటి రూపాయలు ధర ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? నిజమే. రాజస్థాన్‌లోని ఓ గొర్రెపిల్ల కోటీ ధర పలుకుతోంది.

రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన రాజు సింగ్ అనే వ్యక్తి చాలా ఏళ్లుగా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. తన గొర్రెల మందలో ఉన్న ఓ గొర్రె పిల్లకు దాని పొట్ట భాగంలో ఉర్దూ భాషలో 786 ఆకారం ఉంది. అందుకే దాన్ని అమ్మేందుకు అతను ససేమిరా అంటున్నాడు. గత ఏడాది రాజు సింగ్‌కు ఉన్న మందలో ఈ గొర్రెపిల్ల పుట్టింది. ఇది పెరుగుతున్న క్రమంలోనే దాని పొట్ట భాగంలో ఉర్దూ భాషలో ఏదో ఆకారం రావడాన్ని అతను గమనించాడు. మొదటగా అదేంటో తనకు అర్థం కాలేదు. చివరికి తన గ్రామంలో ఉన్న ముస్లీంలకు దాన్ని చూపించగా.. వారు అది ఉర్దూ భాషలో ఉన్న 786 సంఖ్య అని అది దేవుడి ఆశీర్వాదమని తెలిపారు. అయితే భారత్‌ ఉపఖండంలో ఈ 786 సంఖ్యను ముస్లీంలు పవిత్రంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ గొర్రెపిల్లకు ఇలా ఉండటం కొంతమందికి తెలియడంతో దాన్ని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. దాదాపు 70 లక్షల నుంచి కోటీ దాకా చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కానీ రాజు సింగ్ మాత్రం దాన్ని అమ్మేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ గొర్రెపిల్ల తనకు ప్రియమైనదని చెప్పాడు. ఇక దానికి 786 సంఖ్య ఉందని తెలిసినప్పటి నుంచి అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...