Indian Railway: రూ.35 కోసం ఐదేళ్ల పోరాటం.. దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ..

Indian Railway: రూ. 35 రిఫండ్ కోసం ఇండియన్ రైల్వే డిపార్ట్‌మెంట్‌తో ఐదేళ్లు పోరాటం చేశాడు ఓ వ్యక్తి. చివరకు తన పోరాటం ఫలించింది. రైల్వే శాఖ దిగొచ్చింది.

Indian Railway: రూ.35 కోసం ఐదేళ్ల పోరాటం.. దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ..
Irctc
Follow us

|

Updated on: May 31, 2022 | 9:07 AM

Indian Railway: రూ. 35 రిఫండ్ కోసం ఇండియన్ రైల్వే డిపార్ట్‌మెంట్‌తో ఐదేళ్లు పోరాటం చేశాడు ఓ వ్యక్తి. చివరకు తన పోరాటం ఫలించింది. రైల్వే శాఖ దిగొచ్చింది. అతని రూ.35 రూపాయలు అతనికి తిరిగి ఇచ్చేసింది. అంతేకాదు.. అతని చేసిన పోరాటం.. 2.98 లక్షల మందికి సహాయపడింది. మనం బస్సుల్లోనో, ఆటోలోనో ప్రయాణం చేస్తున్నప్పుడు చిల్లర లేదనే కారణంతో ఎంతో కొంత డబ్బులు వదులకోవాల్సి వస్తుంది. కానీ, కొందరు మాత్రం జిద్దుగా ఉంటారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలంటే ఇవ్వాలని పట్టుబడతారు. ఇక మరికొన్ని సందర్భాల్లో రైలు, బస్సు, సినిమా టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు సర్వీస్ ఛార్జీలు, ఇతరాల పేరుతో ఎంతోకొంత కట్ చేస్తుంటారు. చాలా మంది వాటిని లైట్ తీసుకుంటారు. కొద్ది మంది మాత్రమే వాటిని సీరియస్‌గా తీసుకుంటారు. అసలు ఎందుకు కట్ అయ్యింది? దాని అసలు కథ ఏంటనే దానిపై లోతుగా పరిశోధిస్తారు.

రాజస్థాన్‌కు చెందిన ఓ యువ ఇంజనీర్ సుజీత్ కూడా అలాగే చేశాడు. సుజీత్ స్వామి(30) ఢిల్లీ నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్లడానికి 2017, ఏప్రిల్‌లో ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ తరువాత ఏవో కారణాల చేత తన టికెట్‌‌ను క్యాన్సల్ చేసుకున్నాడు. అయితే, 2017 జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, అంతకు ముందే అతను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ.. జీఎస్టీ, సర్వీస్ ఛార్జెస్ పేరుతో రూ. 35 ఎక్కువ కట్ చేసుకుంది రైల్వే శాఖ. దీనిని సీరియస్‌గా తీసుకున్న సుజీత్.. రూ. 35 కోసం ఐదేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులతో రైల్వే శాఖను ఊపిరి సలపకుండా చేశాడు. అతని దెబ్బకు దిగొచ్చిన రైల్వే.. సుజీత్‌కు రూ.35 రిఫండ్ చేసింది. అంతేకాదు.. అతని మాదిరిగానే ఛార్జీల పేరుతో 2.98 లక్షల మందికి కట్ చేయగా.. వారందరికీ రిఫండ్ ఇచ్చింది రైల్వే శాఖ. 2.98 లక్షల మందికి రూ. 35 చొప్పున మొత్తం రూ.243 కోట్లను రిఫండ్ చేసింది. అయితే, సుజీత్ తనకు రావాల్సిన 35 రూపాయల కోసం పోరాటం చేసి.. ఏకంగా 2.98 లక్షల మందికి సహాయం చేశాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..