International Yoga Day 2021: కరోనా సంక్షోభం మధ్య… యావత్ ఇండియా ఇంటర్నెషనల్ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది…

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jun 21, 2021 | 10:51 AM

ప్రస్తుతం ఉరుకుల జీవితంలో మన శరీరం.. మనస్సు రెండు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి దివ్యఔషదమే యోగా.

International Yoga Day 2021: కరోనా సంక్షోభం మధ్య... యావత్ ఇండియా ఇంటర్నెషనల్ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది...
Yoga 1

ప్రస్తుతం ఉరుకుల జీవితంలో మన శరీరం.. మనస్సు రెండు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి దివ్యఔషదమే యోగా. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా శరీరానికి.. మనస్సుకు ఉత్సాహాన్నిస్తుంది. అలాగే ప్రశాంతమైన ఆలోచనలతోపాటు..ఇతర శరీర వ్యాధులను తొలగిస్తుంది. ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది మన దేశమే. ప్రస్తుతం కరోనా రెండో దశ.. యావత్ భారతాన్ని అల్లకల్లోలం చేసింది. ఎంతమంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఈ కరోనా సంక్షోభంలోనూ ఇండియా మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కరోనాపై పోరాడేందుకు యోగాను ఒక సురక్ష కవచంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రతి దేశం, ప్రతి సమాజం యోగా ద్వారా స్వస్థత పొందుతుందని మోదీ చెప్పారు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ఆన్ లైన్ ద్వారా జాతి నుద్దేశించి ప్రసంగించారు. ఏడాదిన్నరగా కరోనాతో భారత్‌ సహా పలుదేశాలు సంక్షోభంలో చిక్కాయన్న మోదీ.. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వైరస్​తో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని తద్వారా మనలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. అటు దేశ సరిహద్దులలో ఉన్న ఆర్మీ జవాన్లు సైతం యోగా దినోత్సవం జరుపుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ ఫోటోలను ఒకసారి చూసెద్దాం.

ప్రధాని నరేంద్రమోదీ పిలుపు…

ఆర్మీ జవాన్ల యోగా దినోత్సవం..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లడఖ్‌లోని వివిధ ఎత్తైన సరిహద్దు అవుట్‌పోస్టులలో 13,000 నుండి 18,000 అడుగుల వరకు యోగా ప్రాక్టీస్ చేస్తున్న ఐటిబిపి సిబ్బంది.

Yoga

Yoga

రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యోగా చేస్తున్నారు.

President

President

లడఖ్‌లోని గాల్వన్ సమీపంలో ఐటిబిపి సిబ్బంది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

1

లోహిత్‌పూర్‌లోని యానిమల్ ట్రైనింగ్ స్కూల్ (ఎటిఎస్) కు చెందిన ఐటిబిపి సిబ్బంది గుర్రాలతో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

2

3

Also Read: కోవిద్ బాధితులకు మొండి చెయ్యేనా …? సెంట్రల్ విస్తా ప్రాజెక్టు మాటేమిటి…? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu