కోవిద్ బాధితులకు మొండి చెయ్యేనా …? సెంట్రల్ విస్తా ప్రాజెక్టు మాటేమిటి…? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

కోవిద్ మృతుల కుటుంబాలకు ..బార్థితులకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించలేమంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన వైనంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజల పట్ల మీ బాధ్యతలు, కర్తవ్యాలు అన్నీ కోల్పోయారని ఆరోపించింది.

  • Publish Date - 10:26 am, Mon, 21 June 21 Edited By: Anil kumar poka
కోవిద్ బాధితులకు మొండి చెయ్యేనా ...? సెంట్రల్ విస్తా ప్రాజెక్టు మాటేమిటి...? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
Centre Lost All Sense Of Credibility Towards People Says Congress

కోవిద్ మృతుల కుటుంబాలకు ..బార్థితులకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించలేమంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన వైనంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజల పట్ల మీ బాధ్యతలు, కర్తవ్యాలు అన్నీ కోల్పోయారని ఆరోపించింది. తమ వద్ద, రాష్ట్రాల వద్ద నిధుల కొరత ఉన్న దృష్ట్యా ఎక్స్ గ్రేషియాను కోవిద్ మృతుల కుటుంబాలకు ఇవ్వలేమని, ఇది తమకు తలకు మించిన భారమని కేంద్రం , అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్న సంగతి గమనార్హం. పైగా భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మరణాల కేసులకు మాత్రమే ఈ సహాయం వర్తిస్తుందని డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం స్పష్టం చేస్తోందని కూడా వివరించింది. అయితే కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా దీనిపై తీవ్రంగా స్పందిస్తూ….అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న మోదీ ప్రభుత్వం ప్రజలపట్ల తన బాధ్యతలను, కర్తవ్యాలను కోల్పోయిందని ట్వీట్ చేశారు. కోవిద్ రోగుల మృతుల కుటుంబాలకు చెల్లించేందుకు మీ వద్ద రూ. 4 లక్షలు లేవా ..? మరి సెంట్రల్ విస్తా ప్రాజెక్టుకు, ప్రధాన మంత్రి ప్యాలస్ కు రూ. 20 వేల కోట్ల మాటేమిటి అని ఆయన ప్రశ్నించారు. దీనికి డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం అడ్డు రాలేదా అన్నారు. అలాగే పెట్రోలు, డీజిల్ ఉత్పత్తుల నుంచి 2020-2021 లో సేకరించిన రూ.3,89,662 కోట్లు ఏమయ్యాయి అని కూడా రణదీప్ సూర్జేవాలా సూటిగా పేర్కొన్నారు.

కోవిద్ మృతుల కుటుంబాలకు 4 లక్షల ఆర్థిక సహాయం చేయాలన్న అభ్యర్థన సరైనదేనని,, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్రం జూన్ 11 న సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ తాజా అఫిడవిట్ లో చేతులెత్తేసింది. కోవిద్ బాధితులకు ఎక్స్ గ్రేషియా చెల్లింపుపై దాఖలైన కొన్ని పిల్స్ ను కోర్టు విచారించిన సందర్భంగా కేంద్రం ఇలా తన నిస్సహాయతను వ్యక్తం చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Vishal’s movie shooting Video: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.వైరల్ వీడియో.

 Harish Rao Met With Road Accident Video: హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం పలువురికి గాయాలు..మంత్రి వాహనానికి అడవి పంది అడ్డు.

 Telangana : స్కూల్ రీఓపెన్ కి గ్రీన్ సిగ్నల్, పేరెంట్స్ లో థర్డ్ వేవ్ టెన్షన్.. HSPA అభిప్రాయం వెల్లడి.

Guntur : ఆకతాయిలు హల్ చల్, పెట్రోల్ బ్యాంకు సిబ్బందిపై దాడి..సిసి కెమెరాలో రికార్డ్ అయ్యిన వీడియో.