IndiGo: ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై భోజనం చేసిన ప్రయాణికులు.. షోకాజ్ నోటీసులు జారీ చేసిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఇండిగో ఎయిర్ పోర్ట్, ముంబై ఎయిర్ పోర్టులకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రన్‌వేపై ప్రయాణికులు కూర్చుని, భోజనం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ కావడంతో ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. సకాలంలో రెండు ఎయిర్ పోర్టులు వివరణ ఇవ్వకుంటే జరిమానాతోపాటు పలు చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ..
ముంబాయి, జనవరి 16: ఇండిగో ఎయిర్ పోర్ట్, ముంబై ఎయిర్ పోర్టులకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రన్‌వేపై ప్రయాణికులు కూర్చుని, భోజనం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ కావడంతో ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. సకాలంలో రెండు ఎయిర్ పోర్టులు వివరణ ఇవ్వకుంటే జరిమానాతోపాటు పలు చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. గత రాత్రి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్ని మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ రోజు ఉదయం రెండు ఎయిర్ పోర్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనపై ముంబై ఎయిర్ పోర్టు, ఇండిగో ఎయిర్ పోర్టు రెండింటినీ బాధ్యులను చేసింది. ప్రయాణీకులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఎయిర్ పోర్టులు విఫలం అయినట్లు పేర్కొంది.
ఎయిర్‌పోర్టుకు రిమోట్ బే C-33 కేటాయించాం. అంటే ఇక్కడ కాంటాక్ట్ స్టాండ్‌కు బదులుగా – కేటాయించబడిన బోర్డింగ్ గేట్ నుంచి విమానంలో ప్రయాణించడానికి, బయటికి వెళ్లేందుకు అనువుగా ఉండే ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ స్టాండ్ ఉంటుంది. టెర్మినల్‌లో రెస్ట్‌రూమ్‌లు, రిఫ్రెష్‌మెంట్స్ వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉంటుంది. కానీ వీటిని ప్రయాణికులకు అందుబాటులో ఉంచలేదని నోటీసులో పేర్కొంది. ప్రయాణికుల సౌలభ్యం, భద్రతా నిబంధనలు, కార్యాచరణ సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా విమాన ఆపరేషన్ జరిగిందని మంత్రిత్వ శాఖ మండిపడింది. ఇండిగో ఫ్లైట్ 6E 2195 నుంచి ఆప్రాన్‌లోకి ప్రయాణీకులు దిగడానికి అనుమతించి నిబంధనలు ఉల్లగించినట్లు పేర్కొంది. ఎలాంటి భద్రతా స్క్రీనింగ్ విధానాన్ని అనుసరించకుండా జనవరి 15వ తేదీన ముంబై విమానాశ్రయంలో 6E 2091 విమానంలో ప్రయాణికులను ఎక్కించింది. నిబంధనలను ఉల్లంఘించిన విషయం ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్ BCAS (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ)కి తెలియజేయలేదని ఇండిగోకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో మంత్రిత్వ శాఖ తెల్పింది. మరోవైపు ముంబై ఎయిర్‌పోర్ట్ కూడా ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ గ్రూప్ (ASG)కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని నోటీసులో పేర్కొంది.
ఇండిగో ఫ్లైట్ వీడియో..
passengers of IndiGo Goa-Delhi who after 12 hours delayed flight got diverted to Mumbai having dinner just next to indigo plane pic.twitter.com/jGL3N82LNS
— JΛYΣƧΉ (@baldwhiner) January 15, 2024
కాగా ఢిల్లీలో పొగమంచు కారణంగా గోవా-ఢిల్లీ విమానాన్ని (6E-2195) ముంబైకి మళ్లించారు. ముంబైకి చేరుకున్న తర్వాత విమానాశ్రయంలోని రన్‌వేపై ప్రయాణికులు డిన్నర్ చేస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గోవా – ఢిల్లీ ఇండిగో విమానం ముంబైకి మళ్లించడం వల్ల ఆదివారం (జనవరి 14) దాదాపు 18 గంటలు ఆలస్యమైందని పలువురు ప్రయాణికులు ఎక్స్‌లో ఆందోళన చెందారు. పొగమంచు కారణంగానే విమానాన్ని ముంబైకి మళ్లించామని, ఆలస్యానికి క్షమాపణలు తెలుపుతున్నామంటూ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.