Mathura Case: మథుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదులో సర్వేపై సుప్రీంకోర్టు స్టే
మథుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కొత్త మలుపు తిరిగింది. షాహీ ఈద్గా మసీదులో సర్వే నిర్వహించడానికి అడ్వొకేట్ కమిషనర్‌ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. జస్టిస్ సంజీవ్‌ఖన్నా , జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వం లోని బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది.

మథుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కొత్త మలుపు తిరిగింది. షాహీ ఈద్గా మసీదులో సర్వే నిర్వహించడానికి అడ్వొకేట్ కమిషనర్‌ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. జస్టిస్ సంజీవ్‌ఖన్నా , జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వం లోని బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. సర్వే కోసం అడ్వొకేట్ కమిషనర్ నియామకం సహేతుకంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించి అలహాబాద్ కోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మథుర లోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదుపై దశాబ్ధాల నుంచి వివాదం నెలకొంది. ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 14 డిసెంబర్ 2023న, అలహాబాద్ హైకోర్టు శ్రీ కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదాస్పద స్థలంలో సర్వేను ఆమోదించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉందని, మొఘల్ కాలంలో దానిని కూల్చివేసి ఇక్కడ మసీదు నిర్మించారని హిందూ పక్షం పేర్కొంది. ఈ వివాదం 350 ఏళ్ల నుంచి కొనసాగుతోంది.
ఈ మొత్తం వివాదం 13.37 ఎకరాల భూమి యాజమాన్య హక్కులకు సంబంధించినది. ఈ స్థలంలో 11 ఎకరాల్లో శ్రీకృష్ణ దేవాలయం ఉంది. మరో 2.37 ఎకరాలు షాహీ ఈద్గా మసీదు సమీపంలో ఉంది. హిందూ పక్షం ఈ స్థలాన్ని శ్రీ కృష్ణుడి జన్మస్థలంగా పేర్కొంది. ఔరంగజేబు ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ మొత్తం వివాదానికి నాంది 350 ఏళ్లు. 1670లో ఔరంగజేబు మధురలోని శ్రీ కృష్ణ జన్మస్థలాన్ని కూల్చివేయాలని ఆదేశించారని, ఆ తర్వాత ఇక్కడ షాహీ ఈద్గా మసీదు నిర్మించడం జరిగిందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటలీ యాత్రికుడు నికోలస్ మనుచి తన వ్యాసంలో రంజాన్ మాసంలో శ్రీకృష్ణ జన్మస్థలం ధ్వంసమైందని పేర్కొన్నారు.
నిర్మాణం తర్వాత, ఈ భూమి ముస్లింల చేతుల్లోకి వెళ్లింది. సుమారు 100 సంవత్సరాల పాటు ఇక్కడ హిందువుల ప్రవేశం నిషేధించారు. 1770లో మొఘల్-మరాఠా యుద్ధం జరిగింది. ఇందులో మరాఠాలు గెలిచి ఆలయాన్ని నిర్మించారు. దీని పేరు ఒకప్పుడు కేశవదేవ్ దేవాలయం. ఇంతలో భూకంపం కారణంగా ఆలయానికి నష్టం వాటిల్లింది. 1815లో కాశీ రాజు కొనుగోలు చేసిన భూమిని బ్రిటీష్ వారు వేలం వేశారు. కానీ అతను ఆలయాన్ని నిర్మించలేకపోయాడు. ఈ భూమి ఖాళీగా ఉందని, ఆ భూమి తమదేనని ముస్లింలు పేర్కొన్నారు.
శ్రీ కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ 1951లో స్థాపించడం జరిగింది. 1944లో ఈ భూమిని ప్రముఖ పారిశ్రామికవేత్త జుగల్ కిషోర్ బిర్లా కొనుగోలు చేశారు. రాజా పత్నిమల్ వారసులతో ఒప్పందం కుదిరింది. ఈ కాలంలో, దేశం స్వాతంత్ర్యం పొందింది. 1951 లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ ఏర్పడింది. దీనికి ఈ భూమి కేటాయించడం జరిగింది. 1953లో ట్రస్టు సొమ్ముతో ఆ స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టి 1958లో పూర్తి చేశారు. 1958లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ పేరుతో కొత్త సంస్థ ఏర్పడింది. ఇదే సంస్థ 1968లో ముస్లిం పక్షంతో ఒప్పందం చేసుకుంది. గుడి, మసీదు రెండూ ఒకే ప్రాంతంలోనే ఉంటాయని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు జన్మస్థలంపై చట్టపరమైన దావా లేదు. శ్రీ కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ ఈ ఒప్పందాన్ని అంగీకరించదని చెప్పారు.
2022లో, సివిల్ జడ్జి అమీన్ ద్వారా షాహీ ఈద్గా మసీదును సర్వే చేయాలని ఆదేశించారు. ఇప్పుడు హిందూ పక్షం మసీదును తొలగించాలని డిమాండ్ చేయగా, ముస్లిం పక్షం ప్రార్థనా స్థలాల చట్టం కింద వాదిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…