AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Maldives row: మాల్దీవుల విషయంలో మనసు మార్చుకోబోం.. స్పష్టం చేసిన ‘ఈజ్‌మైట్రిప్‘

మాల్దీవుల విషయంలో మనసు మార్చుకునే ప్రసక్తే లేదని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ‘ఈజ్‌మై‌ట్రిప్’ స్పష్టం చేసింది. భారత గౌరవానికి కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పింది. మాల్దీవులకు టికెట్లు పునరుద్ధరించే పని చేయబోమని దేశానికి మద్దతుగా నిలుస్తామని మరోసారి తెలిపింది .

India-Maldives row: మాల్దీవుల విషయంలో మనసు మార్చుకోబోం.. స్పష్టం చేసిన ‘ఈజ్‌మైట్రిప్‘
India Maldives Row
Balaraju Goud
|

Updated on: Jan 16, 2024 | 2:39 PM

Share

మాల్దీవుల విషయంలో మనసు మార్చుకునే ప్రసక్తే లేదని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ‘ఈజ్‌మై‌ట్రిప్’ స్పష్టం చేసింది. భారత గౌరవానికి కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పింది. మాల్దీవులకు టికెట్లు పునరుద్ధరించే పని చేయబోమని దేశానికి మద్దతుగా నిలుస్తామని మరోసారి తెలిపింది . మాల్దీవులకు టికెట్లు రద్దు చేయడంతో వెల్లువెత్తిన విమర్శలపై ఆ సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నిషాంత్‌ పిట్టి ఎక్స్ ద్వారా స్పందిస్తూ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో సుదీర్ఘంగా చేసిన పోస్టులో ఆయన మాల్దీవులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు అనుకూలంగా నడుచుకుంటూ.. రెండు దేశాలు కలిసి ‘ఇండియా అవుట్’ క్యాంపెయిన్‌ను నెత్తికెత్తుకున్నాయని ఆరోపించారు. ఇండియా కంటే చైనా టూరిస్టులే తమ దేశానికి ఎక్కువగా వస్తారని, వారి నుంచే ఎక్కువ సొమ్ము తమకు వస్తుందన్న భావన అందులో కనబడుతోందన్నారు.

మాల్దీవులకు టికెట్లు రద్దు చేయడం ‘రిస్కీ డెసిషన్’ అయినప్పటికీ దానికే తాము కట్టుబడి ఉన్నామని నిషాంత్ తెలిపారు. 95 శాతం మంది భారతీయులు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మిగతా 5 శాతం మంది మాత్రం దీనిని రాజకీయంగా చూస్తున్నట్టు చెప్పారు. గతవారం తమ యాప్ డౌన్‌లోడ్స్ 280 శాతం పెరిగినట్టు తెలిపారు.

 మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్