AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజనీరింగ్‌ అద్భుతం.. మంగళూరు LPG అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ కావెర్న్ ప్రాజెక్ట్‌ పూర్తి! దీని ప్రత్యేకలు ఇవే..

మంగళూరులో 80,000 టన్నుల LPG నిల్వ సామర్థ్యంతో భారతదేశంలో అతిపెద్ద భూగర్భ LPG నిల్వ ప్రాజెక్ట్ పూర్తయింది. HPCL కోసం MEIL నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇంధన భద్రతను పెంచుతుంది. రూ.854 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్ అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది.

ఇంజనీరింగ్‌ అద్భుతం.. మంగళూరు LPG అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ కావెర్న్ ప్రాజెక్ట్‌ పూర్తి! దీని ప్రత్యేకలు ఇవే..
Mangalore Lpg Project
SN Pasha
|

Updated on: Jun 20, 2025 | 12:36 PM

Share

భారతదేశంలో అతిపెద్ద భూగర్భ LPG అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ కావెర్న్ ప్రాజెక్ట్‌ మంగళూరులో పూర్తయింది. ఇది దేశ ఇంధన మౌలిక సదుపాయాల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో 60 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో ఉన్న LPG నిల్వ సౌకర్యం ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద నిల్వ సౌకర్యం. మంగళూరులో నిర్మించిన ప్రాజెక్ట్‌ 80 వేల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కోసం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) దీనిని అభివృద్ధి చేసింది. ఈ భూగర్భ LPG అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ కావెర్న్ ప్రాజెక్ట్‌ దేశ పెట్రోలియం నిల్వలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం దేశంలో ఇలాంటి భూగర్భ LPG నిల్వ ప్రాజెక్టులు రెండు మాత్రమే ఉన్నాయి, వాటిలో మంగళూరు ఒకటి. ఇంధన భద్రతను పెంచడంలో, నిరంతర సరఫరాను నిర్ధారించడంలో మంగళూరు అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ కావెర్న్ ప్రాజెక్ట్‌ చాలా ముఖ్యమైనదని కంపెనీ తెలిపింది. ఈ నిల్వ సౌకర్యం ఆరు లక్షల బ్యారెళ్లు లేదా 60 మిలియన్ లీటర్ల ద్రవీకృత పెట్రోలియం వాయువును నిల్వ చేయగలదు. దీనితో పాటు ఇది 40 వేల టన్నుల ప్రొపేన్, 60 వేల టన్నుల బ్యూటేన్‌ను నిల్వ చేయడానికి రూపొందించిన రెండు ప్రత్యేక భూగర్భ గదులను కలిగి ఉంది.

అన్ని పరీక్షలు విజయవంతం: MEIL

రూ.854 కోట్ల వ్యయంతో నిర్మించిన మంగళూరు భూగర్భ LPG అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ కావెర్న్ ప్రాజెక్ట్‌ అన్ని ప్రధాన పరీక్షా దశలను విజయవంతంగా పూర్తి చేసిందని MEIL ఇటీవల తన అధికారిక ఎక్స్-హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. అత్యంత కీలకమైన దశ ‘కావెర్న్ యాక్సెప్టెన్స్ టెస్ట్ (CAT),’ మే 9 నుండి జూన్ 6 వరకు నిర్వహించినట్లు, అది విజయవంతమైందని కంపెనీ తెలిపింది. ఈ అద్భుత ప్రాజెక్ట్‌ 1,083 మీటర్ల సొరంగం కలిగి ఉంది. ప్రాజెక్ట్‌ రెండు ప్రధాన యూనిట్లు.. S1, S2లు వరుసగా 220 మీటర్లు, 225 మీటర్ల లోతులో ఉన్నాయి. ఇంధన సరఫరాలో అంతరాయాలను తొలగించడంలో, ఇంధన సరఫరా పరంగా జాతీయ సంసిద్ధతను పెంచడంలో ఈ అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ కావెర్న్ ప్రాజెక్ట్‌ కీలకమైన దశగా చెప్పవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..