AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ఏళ్లలో ఇంత మందిని ఎన్‌కౌంటర్‌ చేశారా? నంబర్‌ తెలిస్తే షాక్‌ అవుతారు.. డేటా రిలీజ్‌ చేసిన యోగి ప్రభుత్వం!

2017 నుండి 2024 వరకు ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్లపై తాజా డేటా విడుదలైంది. 234 మంది నేరస్థులు మరణించగా, 9,202 మంది గాయపడ్డారు. 14,741 ఎన్‌కౌంటర్లు జరిగాయి, 30,293 మంది అరెస్ట్ అయ్యారు. మీరట్, వారణాసి, ఆగ్రా జోన్లలో ఎక్కువ ఎన్‌కౌంటర్లు జరిగాయి.

8 ఏళ్లలో ఇంత మందిని ఎన్‌కౌంటర్‌ చేశారా? నంబర్‌ తెలిస్తే షాక్‌ అవుతారు.. డేటా రిలీజ్‌ చేసిన యోగి ప్రభుత్వం!
Cm Yogi
SN Pasha
|

Updated on: Jun 20, 2025 | 12:11 PM

Share

2017లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ అంతటా పోలీసు ఎన్‌కౌంటర్లలో గణనీయమైన పెరుగుదల ఉందని ఇటీవలి డేటా వెల్లడిస్తోంది. ఈ ఆపరేషన్లలో అనేక మంది నేరస్థులు హతమయ్యారు. అలాగే వేల సంఖ్యలో పలువురు గాయపడ్డారు. అయితే తాజాగా మొట్ట మొదటిసారి ఉత్తరప్రదేశ్ పోలీసులు గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర నేర నిరోధక కార్యకలాపాలపై సమగ్ర డేటాను విడుదల చేశారు.

యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) రాజీవ్ కృష్ణ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2017 నుంచి 2024 మధ్య పోలీసు ఎన్‌కౌంటర్లలో మొత్తం 234 మంది కరడుగట్టిన నేరస్థులు హతమయ్యారు. అదనంగా ఈ ఘర్షణల్లో 9,202 మంది నేరస్థులు గాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నేరాలకు వ్యతిరేకంగా కఠినమైన జీరో-టాలరెన్స్ విధానాన్ని అమలు చేసింది. గత ఎనిమిది సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్ అంతటా 14,741 ఎన్‌కౌంటర్ సంఘటనలు జరిగాయి. ఈ ఆపరేషన్లలో 30,293 మంది నేరస్థులు అరెస్టు అయ్యారు. అయితే ఎన్‌కౌంటర్‌ ఆపరేషన్స్‌ సమయంలో పోలీసులు కూడా మరణించారు. విధి నిర్వహణలో నేరస్థులతో పోరాడుతున్నప్పుడు 18 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 1,700 మంది పోలీసులు గాయపడ్డారు.

డేటా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మీరట్ జోన్‌లో అత్యధికంగా ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. మొత్తం 4,183 ఆపరేషన్లలో 7,871 మంది నేరస్థులు అరెస్టు అయ్యారు. 2,839 మంది గాయపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 77 మంది భయంకరమైన నేరస్థులు మరణించారు. అలాగే ఇద్దరు పోలీసులు వీరమరణం పొందగా, 452 మంది గాయపడ్డారు. వారణాసిలో1,041 ఎన్‌కౌంటర్‌లలో 2,009 మంది నేరస్థులను అరెస్టు చేశారు. 605 మంది గాయపడ్డారు, 26 మంది మరణించారు. 96 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. అలాగే ఆగ్రా జోన్‌లో 2,288 ఎన్‌కౌంటర్ సంఘటనలు జరిగాయి. దీని ఫలితంగా 5,496 మంది నేరస్థులు అరెస్టు అయ్యారు, 715 మంది గాయపడ్డారు. 19 మంది మరణించారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో 56 మంది పోలీసులు కూడా గాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..