Watch Video: ప్రేమంటే ఇదేరా.. 93 ఏళ్ల వృద్ధుడు తన భార్య కోసం ఏమి చేశాడంటే.. నెట్టింట తెగ వైరల్..
ప్రేమకు వయసు అడ్డుకాదు.. పేదరికం అడ్డుపడదు.. 93 ఏళ్ల వృద్ధుడి ప్రేమ కథ ఇప్పుడు నెట్టింట ప్రజల మనసులను హత్తుకుంటోంది.. తన జీవిత భాగస్వామికి మంగళసూత్రం కొనాలన్న చిన్న కోరిక ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ వృద్ధుడి ప్రేమను గౌరవించిన బంగారం షాపు యజమాని.. మానవత్వం అంటే ఇదే అని గుర్తుచేశాడు.

ప్రేమకు వయసు అడ్డుకాదు.. పేదరికం అడ్డుపడదు.. 93 ఏళ్ల వృద్ధుడి ప్రేమ కథ ఇప్పుడు నెట్టింట ప్రజల మనసులను హత్తుకుంటోంది.. తన జీవిత భాగస్వామికి మంగళసూత్రం కొనాలన్న చిన్న కోరిక ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ వృద్ధుడి ప్రేమను గౌరవించిన బంగారం షాపు యజమాని.. మానవత్వం అంటే ఇదే అని గుర్తుచేశాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌కు చెందిన నివృత్తి శిండే.. తన భార్య శాంతాబాయితో కలిసి తెల్లటి ధోతి కుర్తా ధరించి నిరాడంబరంగా జ్యువెలరీ షాప్‌కు అడుగుపెట్టగా.. వారి ప్రేమను చూసి షాపు యజమానే ముగ్దుడయ్యాడు.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ మహరాజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన.. ప్రేమంటే ఇదేరా.. అంటూ అందర్నీ ఆకట్టుకుంటోంది..
అంబోరా జాహిర్ గ్రామానికి చెందిన శిండే భార్య శాంతాబాయితో కలిసి పండర్ పూర్ పుణ్యక్షేత్రానికి కాలినడకన బయల్దేరాడు.. పాదయాత్ర చేస్తున్న క్రమంలో దారిలో ఉన్న ఓ బంగారు దుకాణంలోకి అడుగుపెట్టాడు. తన వద్ద రూ.1120 ఉన్నాయని.. గత నెల రోజులుగా వీధుల్లో భిక్షాటన చేసి కూడబెట్టిన చిన్న పొదుపుతో తాను తన భార్యకి మంగళసూత్రం కొనాలనుకుంటున్నానని వృద్ధుడు ఈ సందర్భంగా షాప్ యజమానికి చెప్పాడు.. ఆయన మాటలు షాప్ సిబ్బందినే కాదు.. యజమానిని కూడా కదిలించేశాయి. ఆ వృద్ధ జంట ఎంపిక చేసిన మంగళసూత్రాన్ని, కమ్మలతో సహా అందజేశాడు జ్యువెలరీ యజమాని.. వారి డబ్బులను తిరిగి చేతిలో పెట్టి కేవలం రూ.20 మాత్రమే తీసుకున్నాడు. ఇది వారి ప్రేమకు తన తరపున ఆశీర్వాదం అంటూ భావోద్వేగంతో మాట్లాడాడు ఆ యజమాని. ఈ సంఘటన మొత్తం వీడియోగా తీసి షాప్ సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్ సాధించగా నెటిజన్ల ప్రశంసలతో నిండిపోయింది.
వీడియో చూడండి..
“ఇలాంటి ప్రేమను చూసి కన్నీరు ఆగలేదు”.. “ఇది ప్రేమ అంటే ఏంటో చెప్పే కథ” అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ వృద్ధ జంట చూపించిన ప్రేమ మిగిలిన సమాజానికి గొప్ప సందేశం. వయసుతో సంబంధం లేకుండా అర్థం చేసుకునే మనసులు ఉంటే పెళ్లి అనేది జీవితాంతం చిరస్మరణీయ బంధమని ఈ జంట మరోసారి ప్రపంచానికి చూపించింది. ప్రేమకు వయసు లేదని నిరూపించిన నివృత్తి శిందే.. రూ.20కే మంగళసూత్రం ఇచ్చిన దుకాణదారుడి ఔదార్యం.. రెండూ కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..