AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కావేరమ్మకు డెల్టా ప్రజల అపూర్వ స్వాగతం..! వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

తమిళనాడు డెల్టా ప్రాంత ప్రజలు కావేరి నదిని తల్లిలా కొలుస్తారు. కర్ణాటకతో జలాల వివాదం ఉన్నప్పటికీ, కావేరి జలాలు వచ్చినప్పుడు వారు ఆనందంతో హారతి ఇస్తారు, పూజలు చేస్తారు. నీటి ప్రాముఖ్యతను గుర్తించి, దానికి గౌరవం ఇచ్చే ఈ సంప్రదాయం ప్రశంసనీయం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Video: కావేరమ్మకు డెల్టా ప్రజల అపూర్వ స్వాగతం..! వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..
Kaveri Water
SN Pasha
|

Updated on: Jun 20, 2025 | 1:39 PM

Share

నీరు.. ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి జీవనాధారం. నీరు లేకుంటే మనకు మనుగడ లేదు. అయినా కూడా చాలా మంది నీటిని వృధా చేస్తుంటారు. అలాంటి వాళ్ల గురించి పక్కనపెడితే.. నీటి విలువ తెలిసి, నీటిని దైవంలా కొలుస్తూ.. తమ నేలపై పరవళ్లు తొక్కుతూ వచ్చే ప్రతి నీటి బొట్టును.. రెండు చేతులెత్తి మొక్కే ప్రజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల వివాదం ఉన్నప్పటికీ.. కన్నడ గడ్డ నుంచి తమిళ నేలపైకి కావేరి జలాలు వచ్చే సమయంలో తమిళనాడు డెల్టా ప్రాంత ప్రజలు పడే సంతోషం అంతా ఇంతా కాదు. వారి ప్రాంతంలోని కాలువల్లోకి కావేరి జలాలు వస్తుంటే.. ఎదురెళ్లి మరీ హారతులిస్తారు.

అమ్మా.. కావేరమ్మ తల్లి.. మమ్మల్ని బతికించేందుకు.. మాకు బతుకునిచ్చేందుకు వచ్చావా తల్లీ.. అంటూ తమ ఆనందభాష్పాలతో కావేరి నీళ్లకు అభిషేకం చేస్తారు. నీరు అలా వస్తుంటే.. కాలువల్లోకి దిగి.. మొక్కుతుంటారు. ఈ తంతు ప్రతి ఏడాది జరుగుతుంది. తమ జీవితాల్లో వెలుగు నింపి, పంట పొలాలను సస్యశ్యామలం చేయాలని కావేరమ్మను వేడుకుంటూ ఉంటారు. తాజాగా ఈ ఏడాది కూడా కావేరి జలాలు తమిళ గడ్డను తాకుతున్న తరుణంలో డెల్టా ప్రాంత ప్రజలు హరతులిస్తూ.. పూజలు చేశారు. ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నీటి విలువ తెలిసిన మనుషులు.. ఆ జీవధారకు ఇస్తున్న గౌరవం, చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే కళ్లు చెమర్చాల్సిందే.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్