AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vision Loss: లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా స్క్రీన్ చూసిన భారతీయులు.. దృష్టిపై అధిక ప్రభావం అంటున్న అధ్యయనాలు

Vision Loss:కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ ఆర్ధిక కష్టాలే కాదు అనారోగ్యాలను కూడా తీసుకొచ్చింది. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ శాతం..

Vision Loss: లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా స్క్రీన్ చూసిన భారతీయులు.. దృష్టిపై అధిక ప్రభావం అంటున్న అధ్యయనాలు
Vision
Surya Kala
|

Updated on: Jun 17, 2021 | 11:16 AM

Share

Vision Loss:కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ ఆర్ధిక కష్టాలే కాదు అనారోగ్యాలను కూడా తీసుకొచ్చింది. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ శాతం ఉద్యోగులు ఇంటి దగ్గరే తమ ఉద్యోగ విధులను నిర్వహిస్తున్నారు. దీని కారణంగా భారతీయుల కంటి చూపుపై ఎక్కువ ప్రభావం చూపించిందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది ఆన్ లైన్ చదువులు, వినోదం, ఉద్యోగం, ఆన్ లైన్ తరలింపులు వంటివి చేపట్టారు. కంప్యూటర్ స్క్రీన్స్, స్మార్ట్ ఫోన్లు, టీవీలను ఎక్కువ ఉపయోగించడం వలన దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది కంటి చూపు పై ప్రభావం చూపించింది . కంటిశుక్లం, గ్లాకోమా మరియు వయస్సు-సంబంధిత కంటి జబ్బులు , ఇతర అంశాలు కంటి చూపుపై ప్రభావితం చేసినప్పటికీ.. భారత దేశ వ్యాప్తంగా 27.5 కోట్ల మంది భారతీయులు లేదా జనాభాలో దాదాపు 23% మంది ఎక్కువ అసమయం స్క్రీన్ ను చూస్తున్న కారణంగా ఎక్కువ మందిలో కంటి చూపు బలహీనపడుతుందని ఒక అధ్యయనం తెలిపింది.

నిజానికి 2020 లో భారతదేశంలో వినియోగదారుని సగటు స్క్రీన్ సమయం 6 గంటలు 36 నిమిషాలు. ఇది అనేక దేశాల కంటే చాలా తక్కువగా ఉంది. రోజువారీ సగటు స్క్రీన్ సమయం దాదాపు 24 దేశాల్లో అధికంగా ఉంది. లిప్పీన్స్ (10:56 గంటలు), బ్రెజిల్ (10:08 గంటలు), దక్షిణాఫ్రికా (10:06 గంటలు), యుఎస్ (07:11 గంటలు) మరియు న్యూజిలాండ్ (06:39 గంటలు). అయితే స్క్రీన్ ను ఎక్కువ సమయంచూస్తే .. దృష్టిపై ప్రభావం అధికంగా భారత దేశంలో మాత్రమే ఉంది. దీనికి కారణం అధిక జనాభా అని అంచనావేస్తున్నారు. అంతేకాదు లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎక్కువగా ఇంట్లోనే సమయం వెచ్చించారు. అందుకే భారత్ లో స్క్రీనింగ్ సమయం పెరిగిందని నివేదిక పేర్కొంది.

లాన్సెట్ గ్లోబల్ హెల్త్, డబ్ల్యూహెచ్‌ఓ, వంటి వివిధ సంస్థలు పలు అధ్యయనాలు చేపట్టాయి. ఫీల్-గుడ్ కాంటాక్ట్స్ యొక్క నివేదిక ప్రకారం, “స్క్రీన్ సమయం పెరగడంతో దృష్టి లోపం ఎక్కువగా ఉందని తెలిపింది. దేశంలో ఉన్న జనాభా పరిమాణం , జన సాంద్రత కూడా దృష్టిపై ప్రభావాన్ని చూపాయి. చైనాలో కూడా ఆన్‌లైన్‌లో గడిపిన గంటలు చాలా తక్కువ, కానీ దృష్టి నష్టం అధికంగా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. దేశంలోని వినియోగదారులు స్క్రీన్‌తో గడిపిన సగటు 5 గంటలు మరియు 22 నిమిషాలు, ఇది 27.4 కోటి ప్రజలు, లేదా జనాభాలో 14.1 శాతంగా ఉంది.

Also Read: ఏపీలో వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్న అధికారులు