AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News for Pensioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఒకేసారి రూ.5 లక్షలు తీసుకోచ్చు..

పెన్షనర్లకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్  NPS సబ్‌స్క్రైబర్లకు స్కీమ్‌లో చేరిన వారికి తీపికబురు అందించింది. PFRDA తాజాగా NPS విత్‌డ్రాయెల్ లిమిట్‌ను పెంచుతూ...

Good News for Pensioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఒకేసారి రూ.5 లక్షలు తీసుకోచ్చు..
Good News for Pensioners
Sanjay Kasula
|

Updated on: Jun 17, 2021 | 10:41 AM

Share

పెన్షనర్లకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్  NPS సబ్‌స్క్రైబర్లకు స్కీమ్‌లో చేరిన వారికి తీపికబురు అందించింది. PFRDA తాజాగా NPS విత్‌డ్రాయెల్ లిమిట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్‌ఆర్‌డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ కార్పస్ డబ్బులను ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇది చాలా మంది పెన్షనర్లకు ఊరట కల్పించింది. NCP స్కీమ్‌లో చేరిన వారు మెచ్యూరిటీ సమయంలో పూర్తి డబ్బులు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. కొంత డబ్బుతో ముందుగా యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి సబ్‌స్క్రైబర్లకు ప్రతి నెలా పెన్షన్ అందిస్తారు. అయితే ఇప్పుడు కేంద్రం కొత్త నిబంధనను తీసుకువచ్చింది.

అయితే కొత్తగా కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన నిబంధనలతో పెన్షనర్లకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది. పెన్షన్ కార్పస్ రూ.5 లక్షలకు వరకు ఉంటే.. పూర్తి డబ్బులను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సిన పని లేదు. ఇది వరకు రూ.2 లక్షల వరకు మాత్రమే ఈ బెనిఫిట్ ఉండేది. అంటే కార్పస్ మొత్తం రూ. 2 లక్షల వరకు ఉంటే.. పూర్తి డబ్బులు వెనక్కి తీసుకునేవారు. ఇకపై రూ.5 లక్షల వరకు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు.

ఇకపోతే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటేమో టైర్ 1 అకౌంట్. రెండోదేమో టైర్ 2 అకౌంట్. టైర్ 1 ఎన్‌పీఎస్ అకౌంట్ పెన్షన్ అకౌంట్. ఇక టైర్ 2 అకౌంట్ అనేది ఇన్వె్స్ట్‌మెంట్ అకౌంట్. ప్రస్తుతం యాన్యుటీ ప్లాన్‌పై 5.5 శాతం వరకు రాబడి లభిస్తోంది.

ఇవి కూడా చదవండి : AP Exams: ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్..

ఏటీఎంలో దొంగలు పడ్డారు.. సీసీ కెమెరాను పగలగొట్టారు.. ఇక అంతా ఓకే అనుకుంటే..ఆ గదిలో ఓ మూల వణుకు పుట్టించింది..