Nishpanda Bhava Pose: మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ యోగాసనాన్ని ట్రై చేయండి..

Nishpanda Bhava Pose: మారుతున్నా కాలం.. కాలంతో పాటు పరుగులు పెడుతూ జీవించాల్సిన పరిష్టితులు.. పరుగుల ఉరుకుల జీవితం. దీంతో నిర్ణీత వేళల్లో తినడానికి,..

Nishpanda Bhava Pose: మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ యోగాసనాన్ని ట్రై చేయండి..
Nishpanda Bhava Pose
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2021 | 10:07 AM

Nishpanda Bhava Pose: మారుతున్నా కాలం.. కాలంతో పాటు పరుగులు పెడుతూ జీవించాల్సిన పరిష్టితులు.. పరుగుల ఉరుకుల జీవితం. దీంతో నిర్ణీత వేళల్లో తినడానికి, నిద్రపోవడానికి ఉండదు. దీంతో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కనుకనే ప్రతి రోజు యోగాసనాలను ఒక 15 నిమిషాల పాటు అయినా క్రమం తప్పకుండా వేస్తె.. అనారోగ్యం, ఆందోళన, లు దరిచేరవు. శారీరక, మానసిక ఆనందాన్ని ఇస్తాయి యోగాసనాలు. ఈరోజు మనసు ప్రశాంతంగా ఉండడానికి చేయాల్సిన యోగాసనం గురించి తెలుసుకుందాం.

యోగాసనాల్లో ఒకటి నీ స్పంద భావ ఆసనం. యోగా చేస్తున్న సమయంలో మనసు లో ఎటువంటిఆలోచనలు లేకుండా ప్రశాంతం గా ఉండాలనుకునేవారు చేయాల్సిన ఆసనం నీ స్పంద భావ ఆసనం. ఈ ఆసనం వేయు సమయంలో మనసుకు స్పందన ఉండకూడదు.. అందుకనే ఈ ఆసనానికి ఆ పేరు వచ్చింది.

ఆసనం చేయు పద్దతి:

ముందుగా రెండు కాళ్లు చాచి రిలాక్స్ గా కూర్చోవాలి. రెండు కాళ్ల మధ్య 10 లేక 18 అంగుళాల దూరం వుండాలి. కాళ్లను వదులుగా వుంచాలి. రెండు చేతులు శరీరానికి వెనుక వైపున రెండు ప్రక్కల భూమిపై ఆన్చి వుంచాలి. శిరస్సును పైకి ఎత్తి, మెల్లమెల్లగా శ్వాసను పీల్చాలి. అంతే మెల్లగా విడవాలి.

మొత్తం శరీరం మీద మనస్సును కేంద్రీకరించి అవయవాలన్నింటిని వదులు చేయాలి. యీ విధంగా అవసరమైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. చేతులు అలిసిపోతే వీపును గోడకు ఆనించి యీ ఆసనాన్ని వేయవచ్చు.

ఈ ఆసనం వేయడం వలన లాభాలు:

ఇది శవాసనం వలె శరీర అవయవాలకు విశ్రాంతి కలిగిస్తుంది. తరువాత వివరించబడ్డ ఆసనాలు వేయునప్పుడు, అలసట కలిగితే మధ్య మధ్యన యీ ఆసనం వేస్తూ వుండాలి.

Also Read:   10 రోజుల్లో భార్య స్థానం ఇవ్వు లేదంటే.. నీ ఫ్యామిలీకి చుక్కలే అని కార్తీక్ కి వార్నింగ్ ఇచ్చిన మోనిత