Viral Video: సింహాల గుంపుతో గేదె పోరాటం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే.! వైరల్ వీడియో

Buffalo Fights Lion: సింహం గేదె పక్కన ఉన్న దూడను నోట కరుచుకుని పొదల్లోకి వెళ్తుంది. అయితే ఆ తల్లి గేదె అధైర్యపడకుండా బిడ్డ కోసం పోరాటానికి...

Viral Video: సింహాల గుంపుతో గేదె పోరాటం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే.! వైరల్ వీడియో
Viral Video Buffalo
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 17, 2021 | 12:03 PM

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి ఏదీలేదు. ఆమె స్థానాన్ని ఎవరూ కూడా భర్తీ చేయలేరు. తన బిడ్డలకు చిన్న దెబ్బ తగిలినా.. ఆ తల్లి గుండె విలవిల్లాడిపోతుంది. పిల్లలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా.. అమ్మ మనసు సహించదు. తన గురించి పట్టించుకోకుండా.. వాటి నుంచి తన బిడ్డలను బయటపడేసే దాకా పోరాడుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తల్లిప్రేమకు అడ్డం పట్టేలా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరి ఫిదా అవుతున్నారు.

ఇందులో ఓ తల్లి తన బిడ్డను రక్షించుకునేందుకు ఎంతటి పోరాటం చేసిందో మనం చూడవచ్చు. అడవి మార్గంలో ఓ గేదె తన బిడ్డతో కలిసి వెళుతుండగా.. అనూహ్యంగా ఆరు సింహాలు వాటిపై దాడికి దిగుతాయి. అవన్నీ కూడా ఆ గేదెను ఒక్కసారిగా చుట్టుముడతాయి. ఇంతలో ఓ సింహం గేదె పక్కన ఉన్న దూడను నోట కరుచుకుని పొదల్లోకి వెళ్తుంది. అయితే ఆ తల్లి గేదె అధైర్యపడకుండా బిడ్డ కోసం పోరాటానికి దిగుతుంది. ఆ ఆరు సింహాలతో యుద్ధం చేస్తుంది. తన బిడ్డను కాపాడుకుంటుంది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేసి ”తల్లి ధైర్యం” అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 28,200పైగా వ్యూస్ వచ్చాయి. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి గేదె చూపించిన ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ”తల్లి ప్రేమకు ఇదే నిదర్శనం” అని ఒకరు కామెంట్ చేయగా.. ”ది ఓన్లీ వారియర్” అని మరొకరు కామెంట్ చేశారు.

మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!