AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Road Congress: ఉత్తరప్రదేశ్‌పై నితిన్‌ గడ్కరీ వరాల జల్లు.. అమెరికా తరహాలో రహదారులు

ఉత్తర ప్రదేశ్ న్యూస్: ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) 81వ సెషన్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నితిన్ గడ్కరీ హాజరయ్యారు..

Indian Road Congress: ఉత్తరప్రదేశ్‌పై నితిన్‌ గడ్కరీ వరాల జల్లు.. అమెరికా తరహాలో రహదారులు
Indian Roads Congress 2022
Subhash Goud
|

Updated on: Oct 09, 2022 | 12:05 PM

Share

ఉత్తర ప్రదేశ్ న్యూస్: ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) 81వ సెషన్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నితిన్ గడ్కరీ హాజరయ్యారు. అక్టోబర్ 8 నుంచి 11 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 2500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ, ‘2024 ముగిసేలోపు ఉత్తరప్రదేశ్‌లో రూ. 5 లక్షల కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులు వస్తాయని హామీ ఇస్తున్నానని అన్నారు. రూ.8 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాను. ఉత్తరప్రదేశ్ ఈ ఈవెంట్‌ను నిర్వహించడం ఇది ఐదవసారి అని అంటూ యూపీపై హామీల వర్షం కురిపించారు.

ఉత్తరప్రదేశ్ రోడ్లు అమెరికా తరహాలో..

ఇవి కూడా చదవండి

ఇక 2024 చివరి నాటికి ఉత్తరప్రదేశ్ రోడ్లను అమెరికా తరహాలో తీర్చిదిద్దడమే లక్ష్యమని నితిన్ గడ్కరీ తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా రోడ్ల నిర్మాణంపై దృష్టి సారిస్తామన్నారు. ఆర్థిక వ్యవస్థ, జీవావరణ శాస్త్రంతో పాటు పర్యావరణంపై కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీంతో ఇథనాల్, మిథనాల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలను వినియోగించాలని గడ్కరీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం గురించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని 25 కోట్ల మంది ప్రజల ఆదాయాన్ని పెంచాలంటే, రాష్ట్ర ప్రాథమిక అవసరాలను తీర్చడంపై దృష్టి పెట్టాలని సీఎం యోగి అన్నారు. దీనిని పరిష్కరించడానికి మేము రాష్ట్రంలోని రహదారుల అనుసంధానంపై శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. సిఎం యోగి గడ్కరీని ఉద్దేశించి మాట్లాడుతూ, నేడు రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై గడ్కరీ చేసిన శ్రద్ధ గొప్ప నమూనాగా ఉందని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి