Indian Railways: రైల్వే స్టేషన్స్‌లో రూ. 20కే రూమ్స్‌.. ఈ సదుపాయాన్ని ఎలా పొందాలంటే..

ఇండియన్‌ రైల్వేస్‌ ప్రయాణికులకు ఎన్నో రకాల సదుపాయాలను అందిస్తుంది. అయితే వీటిలో కొన్ని సదుపాయాల గురించి చాలా మందికి తెలియదు. నిజానికి చెప్పాలంటే ఇలాంటి సదుపాయాల గురించి పెద్దగా ప్రచారం కూడా ఉండదు. ఇండియన్‌ రైల్వేస్‌ అందించే అలాంటి సదుపాయాల్లో...

Indian Railways: రైల్వే స్టేషన్స్‌లో రూ. 20కే రూమ్స్‌.. ఈ సదుపాయాన్ని ఎలా పొందాలంటే..
Indian Railways
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 18, 2023 | 10:54 AM

ఇండియన్‌ రైల్వేస్‌ ప్రయాణికులకు ఎన్నో రకాల సదుపాయాలను అందిస్తుంది. అయితే వీటిలో కొన్ని సదుపాయాల గురించి చాలా మందికి తెలియదు. నిజానికి చెప్పాలంటే ఇలాంటి సదుపాయాల గురించి పెద్దగా ప్రచారం కూడా ఉండదు. ఇండియన్‌ రైల్వేస్‌ అందించే అలాంటి సదుపాయాల్లో రైల్వే స్టేషన్స్‌లో అద్దెకు గదులు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్‌లో కేవలం రూ. 20కే అన్ని వసతులు ఉన్న గదిని పొందొచ్చు. అదేంటి.. ఇంత తక్కువ రేటులో గదులు ఇవ్వడం ఏంటి.? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. కానీ ఇది నిజమే అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి, అవేంటంటే..

కొన్ని సమయాల్లో వర్షాలు, పొగ మంచు కారణంగా రైళ్లు క్యాన్సిల్‌ అవుతుండడం సర్వసాధరణమైన విషయం. ఇలాంటి సమయాల్లో రైళ్‌లను క్యాన్సల్‌ చేయడం లేదా షెడ్యూల్‌ వాయిదా వేస్తుంటారు. అయితే అప్పటి వరకు ప్రయాణికులు ఎక్కడ వేచి ఉండాలి.? ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే ఇండియన్‌ రైల్వేస్‌ ప్రయాణికులకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. రైల్వేస్‌లో ఉండే గదులను కేవలం రూ. 20 నుంచి రూ. 40 చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ఈ గదుల్లో 48 గంటల పాటు ఉండొచ్చు.

అయితే ఈ గదులను ఉపయోగించుకోవాలనుకునే వారు కచ్చింగా కన్ఫామ్‌డ్‌ టికెట్‌, పీఎన్‌ఆర్‌ నెంబర్‌ కలిగి ఉండాలి. ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి స్టేషన్స్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ సదుపాయాన్ని పొందాలంటే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ww.rr.irctctourism.com/#/home లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆర్‌ఏసీ టికెట్‌ ఉన్న వారు కూడా ఈ సదుపాయాన్ని పొందొచ్చు. ఒక్క పీఎన్‌ఆర్‌ నెంబర్‌పై కేవలం ఒకే గదిని ఇస్తారు. ఎవరు ముందుగా బుక్‌ చేసుకుంటారన్న దానిపైనే గదులను కేటాయిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..