AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: మే 1 నుంచి రైల్వే ఉద్యోగులు నిరవధిక సమ్మె.. అన్ని రైలు ఆపరేషన్స్ బంద్!

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్న తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే మే నుంచి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని కేంద్రానికి రైల్వే ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. జాయింట్‌ ఫోరమ్‌ ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (JFROPS) ఆధ్వర్యంలో పలు రైల్వే ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మె సిద్ధమవుతున్నారు. మే 1వ తేదీ నుంచి అన్ని రైలు సర్వీసుల ఆపరేషన్‌ను నిలిపివేస్తామని హెచ్చరించారు.

Indian Railway: మే 1 నుంచి రైల్వే ఉద్యోగులు నిరవధిక సమ్మె.. అన్ని రైలు ఆపరేషన్స్ బంద్!
Indian Railways
Balaraju Goud
|

Updated on: Mar 01, 2024 | 2:06 PM

Share

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్న తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే మే నుంచి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని కేంద్రానికి రైల్వే ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. జాయింట్‌ ఫోరమ్‌ ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (JFROPS) ఆధ్వర్యంలో పలు రైల్వే ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మె సిద్ధమవుతున్నారు. మే 1వ తేదీ నుంచి అన్ని రైలు సర్వీసుల ఆపరేషన్‌ను నిలిపివేస్తామని హెచ్చరించారు.

JFROPS కోర్ కమిటీ సమావేశంలో మే 1, 2024 (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) నుండి OPS కోసం నిరవధిక సమ్మెను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు JFROPS కన్వీనర్ మరియు ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. “కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో పాత నిర్వచించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్‌కు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి లేదన్నారు. దీంతో డైరెక్ట్ యాక్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు.” అని అన్నారు. JFROPS ఆధ్వర్యంలోని వివిధ యూనియన్ల ప్రతినిధులు సంయుక్తంగా మార్చి 19 న రైల్వే మంత్రిత్వ శాఖకు అధికారికంగా నోటీసు ఇస్తామని తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేయాలని మంత్రిత్వ శాఖ నోటీసు ఇచ్చింది. మే 1, 2024న, అంటే అంతర్జాతీయ “కార్మిక దినోత్సవం రోజున దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు ఉద్యోగులు, కార్మికులు. దీంతో అన్ని రైలు సేవల ఆపరేటింగ్ నిలిచిపోనుంది. JFROPS ఆధ్వర్యంలో పాల్గొన్న అనేక ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా రైల్వే ఉద్యోగులతో పాటు సమ్మెకు దిగనున్నాయి.

“ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మేము అనేక నిరసనలు చేశాం. OPS ను పునరుద్ధరించాలని మేము వారిని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాశామన్నారు JFROPS కన్వీనర్ శివ గోపాల్ మిశ్రా. కానీ ప్రభుత్వం మా డిమాండ్లను పట్టించుకోలేదు. ఇప్పుడు మేము నిరవధిక సమ్మెకు వెళ్లవలసి వచ్చిందని తెలిపారు JFROPS కన్వీనర్ శివ గోపాల్ మిశ్రా.

అఖిల భారత డిఫెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ సి.శ్రీకుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరుకు అంతరాయం కలగకుండా ప్రభుత్వ ఉద్యోగులు 20 ఏళ్లుగా ఓపికగా నిరీక్షిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అన్ని ప్రభుత్వాలు తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులపై వివక్ష ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…