Indian parliamentary committee: ఫేస్‌బుక్, ట్విటర్‌లకు భారత పార్లమెంటరీ కమిటీ షాక్.. ఆ విషయంలో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు..
Indian parliamentary committee: సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్‌లో యూజర్ల భద్రతపై భారత పార్లమెంటరీ కమిటీ అనుమానాలు లేవనెత్తింది.

Indian parliamentary committee: సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్‌లో యూజర్ల భద్రతపై భారత పార్లమెంటరీ కమిటీ అనుమానాలు లేవనెత్తింది. ఇందులో భాగంగా ఈ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో యూజర్ల సమాచార భద్రత గురించి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇందుకోసం ఈనెల 21వ తేదీన పార్లమెంటరీ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఇటీవల వాట్సప్ ప్రైవసీ పాలపై విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారత పార్లమెంటరీ కమిటీ ఈ సమన్లు జారీ చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈనెల 21న జరగనున్న సమావేశంలో సోషల్ మీడియాలో పౌరుల హక్కుల రక్షణ, సమాచార దుర్వినియోగం, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రధానంగా ఫేస్‌బుక్, ట్విటర్ సంస్థల ప్రతినిథులను పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించనున్నట్లు విశ్వసనీనయ వర్గాల సమాచారం.
Also read:
గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగురవేయాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు