AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Drones: దటీజ్ ఇండియా.. ఆస్ట్రేలియన్‌ నేవీకి భారత డ్రోన్స్ సప్లై.. వివరాలివే..!

రక్షణ రంగంలో స్వావలంబన సాధించడమే కాదు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతున్నాయి భారత సంస్థలు. ఇండియన్‌ నేవీకి ఇప్పటికే అత్యాధునిక డ్రోన్లు సరఫరా చేస్తున్న పుణే..

Indian Drones: దటీజ్ ఇండియా.. ఆస్ట్రేలియన్‌ నేవీకి భారత డ్రోన్స్ సప్లై.. వివరాలివే..!
Drones
Shiva Prajapati
|

Updated on: Mar 17, 2023 | 8:14 PM

Share

రక్షణ రంగంలో స్వావలంబన సాధించడమే కాదు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతున్నాయి భారత సంస్థలు. ఇండియన్‌ నేవీకి ఇప్పటికే అత్యాధునిక డ్రోన్లు సరఫరా చేస్తున్న పుణే సంస్థ తాజాగా వాటిని ఆస్ట్రేలియా నౌకాదళానికి విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మేడిన్‌ ఇండియా ఉత్పత్తులను భారత రక్షణ మంత్రిత్వశాఖ బాగా ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో హిమాలయన్‌ పర్వతాల ఆవల చైనాతో సరిహద్దుల వెంబడి గస్తీని ముమ్మరం చేస్తోంది. రక్షణ రంగంలో స్వావలంబనకు సిద్ధమవుతున్న భారత్‌ – ఇప్పటికే అనేక ప్రైవేట్‌ సంస్థలకు తయారీ లైసెన్సులు మంజూరు చేసింది. ఈ అనుమతుల్లో భాగంగా పుణేకు చెందిన సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వరుణ పేరుతో మనుషులను కూడా మోసుకెళ్లగలిగే డ్రోన్లను తయారు చేసింది. దాదాపు 130 కేజీల బరువు మోసుకెళ్ల ఈ డ్రోన్‌ 25-30 కిలోమీటర్ల దూరం వరకు దాదాపు 30 నిమిషాల పాటు ఎగరగలదు. యుద్ధనౌకలపై సిబ్బందిని తరలించేందుకు వీలుగా ఈ డ్రోన్‌ను డిజైన్ చేశారు. అంతే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎయిర్‌ అంబులెన్స్‌గా కూడా పనిచేస్తాయి.ఈ డ్రోన్‌ పనితీరును ప్రధాని నరేంద్ర కూడా పరిశీలించారు.

ఈ డ్రోన్ల తయారీకి భారతీయ నౌకాదళం చక్కని ప్రోత్సాహం అందించింది. అంతే కాదు ఈ డ్రోన్లకు భారీ ఆర్డర్‌ కూడా ఇచ్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌ వంటి యుద్ధ విమాన నౌకలకు సరుకు, సిబ్బందిని తరలించేందుకు ఈ డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఇప్పుడు ఈ డ్రోన్లను ఆస్ట్రేలియా రాయల్‌ నేవీకి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుణే సంస్థ ఆస్ట్రేలియా ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రైవేట్‌ రంగంలో రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు ఇండియన్‌ నేవీ -ఐడెక్స్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అంతే కాదు ప్రైవేట్‌ సంస్థలు ప్రయోగాలు చేపట్టేందుకు సొంత వేదికలను అందిస్తోంది. నాటికి రక్షణ ఉత్పత్తులు తయారు చేసే ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు 5 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేపట్టాలని ప్రధాని లక్ష్యంగా నిర్దేశించారు.

మరో వైపు చైనా ఆగడాలను అరికట్టేందుకు హిమాలయాల సరిహద్దుల్లో నిఘా కోసం అమెరికా నుంచి అత్యాధునిక సైనిక నిఘా డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ఇండియా సిద్ధమవుతోంది. MQ-9B డ్రోన్స్‌ గా పిలిచే ఈ అత్యాధునిక డ్రోన్స్‌లో యుద్ధం చేసేందుకు కావాల్సిన ఆయుధసామగ్రి అంతా ఉంటుంది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి చెక్‌ పెట్టేందుకు కూడా వీటిని వినియోగించాలన్నది ఇండియా అభిమతంగా కనిపిస్తోంది. శాన్‌ డియాగోకు చెందిన జనరల్‌ ఆటమిక్స్‌ సంస్థ ఈ డ్రోన్లను తయారు చేస్తోంది. ఈ ఒప్పందానికి అమెరికా ఆమోదం తప్పనిసరి. రెండు ప్రభుత్వాలు ఒప్పందంపై సంతకం చేసేందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. ఇది జరిగితే అమెరికాతో ఒప్పంద స్నేహం లేకుండా ఈ సైనిక డ్రోన్లను కొనుగోలు చేసిన మొదటి దేశంగా ఇండియా నిలుస్తుంది. ఈ తరహా డ్రోన్లను కనీసం 30 కొనుగోలు చేయాలని భారత్‌ తొలుత భావించింది. వీటి విలువ 3 బిలియన్‌ డాలర్లు. అయితే సైన్యానికి చెందిన వివిధ విభాగాలతో చర్చించిన తర్వాత ఈ సంఖ్యను 18 నుంచి 24 వరకు ఖరారు చేసే అవకాశం ఉంది. వీటిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రధాని మోదీ నేతృత్వంలోని రెండు కమిటీలు ఆమోదించాల్సి ఉంటుంది. మరో వైపు ఈ ఒప్పందం ఖరారైతే అమెరికా, ఇండియా మధ్య రక్షణ బంధం మరింత దృఢం కానుంది. 2008లో భారత్‌, అమెరికా రక్షణ వ్యాపారం సున్నా. 2020 నాటికి ఇది 20 బిలియన్‌ డాలర్లకు చేరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..