Gujarat Conman: పోలీసులనే బకరాలను చేసిన కేటుగాడు.. ఏకంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో..

దొంగ ఎవరో, దొర ఎవరూ ఇట్టే గుర్తుపట్టేస్తామని పోలీసులు చాలా సందర్భాల్లో చెప్తుంటారు. కాని, అది నిజం కాదని చాలా సందర్భాల్లో రుజువవుతూ ఉంటుంది. కశ్మీర్‌లోనూ అలాగే జరిగింది.

Gujarat Conman: పోలీసులనే బకరాలను చేసిన కేటుగాడు.. ఏకంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో..
Gujarat Conman
Follow us

|

Updated on: Mar 17, 2023 | 8:16 PM

దొంగ ఎవరో, దొర ఎవరూ ఇట్టే గుర్తుపట్టేస్తామని పోలీసులు చాలా సందర్భాల్లో చెప్తుంటారు. కాని, అది నిజం కాదని చాలా సందర్భాల్లో రుజువవుతూ ఉంటుంది. కశ్మీర్‌లోనూ అలాగే జరిగింది. వచ్చిన వ్యక్తిని చూసి ఒక్కసారి కాదు రెండుసార్లు కశ్మీర్‌ పోలీసులు మోసపోయారు. ఎవరో చెప్తేగాని తెలియలేదు వాళ్లకు మోసపోయిన సంగతి. కాని జరగాల్సిన నష్టమంతా ఆపాటికి జరిగిపోయింది.

మామూలు వ్యక్తులు మోసపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. కాని, పోలీసులే మోసపోతే.. అలాంటి సంఘటన జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకుంది. గుజరాత్‌కు మోసగాడు కిరణ్‌ భాయ్‌ పటేల్‌ ఒక్కసారి కాదు రెండుసార్లు జమ్ము కశ్మీర్‌ పోలీసులను బురిడి కొట్టించారు. ఫిబ్రవరిలో ఒకసారి, ఈ నెలలో ఒకసారి ఇతను కశ్మీర్‌లో పర్యటించాడు.

ప్రధాని కార్యాలయంలో వ్యూహాలు, ప్రచారాల అదనపు డైరెక్టర్‌గా తనను తాను చెప్పుకున్న ఈ వ్యక్తికి జమ్ము కశ్మీర్‌ పోలీసుల నుంచి Z ప్లస్‌ సెక్యూరిటీ అందించడంతో పాటు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ మహీంద్ర స్కార్పియో SIV, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో వసతి సమకూర్చారు. ఆయన ఎక్కడికెళ్లినా భారీ బందోబస్తు కల్పించారు.

ఇవి కూడా చదవండి

అంతే కాదు శ్రీనగర్‌ను సందర్శించిన రెండుసార్లు కిరణ్‌ భాయ్‌ పటేల్‌ అక్కడి అధికారులతో సమీక్ష సమావేశాలూ నిర్వహించారు. గుజరాత్‌కు చెందిన ఇతని ట్విట్టర్‌లో వేలాది మంది ఫాలోయర్స్ ఉన్నారు. గుజరాత్‌ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ వాఘేలా కూడా ఆయన ఫాలోవర్స్‌లో ఒకరు. అమెరికాలోని కామన్‌వెల్త్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ, తిరుచ్చి IIM నుంచి MBA చేశానని ట్విట్టర్‌ బయోలో చెప్పుకున్నాడు కిరణ్‌ భాయ్‌ పటేల్‌. కశ్మీర్‌లో తన పర్యటనలను అధికారిక పర్యటనలుగా చెప్పుకున్న పటేల్‌ వాటిని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ కూడా చేశారు. కశ్మీర్‌ పర్యటనలో అతను ఎక్కడికెళ్లినా చుట్టు పారామిలటరీ గార్డులు రక్షణగా నిలిచారు.

కశ్మీర్‌లోని దూద్‌పత్రి ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చడం, గుజరాత్‌ నుంచి పర్యాటకులను పెద్ద సంఖ్యలో అక్కడి రప్పించడంపై ఇతను సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

పది రోజుల క్రితమే ఇతన్నీ అరెస్టు చేసినా తమ తప్పు ఎక్కడ బయటపడుతుందోనని ఆ విషయాన్ని పోలీసులు దాచిపెట్టినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరిలో కశ్మీర్‌ వచ్చిన కిరణ్‌ భాయ్‌ పటేల్‌ రెండు వారాలు తిరగకుండానే మళ్లీ రావడంతో అక్కడి ఉన్నతాధికారులకు అనుమానం కలిగింది. అతను మోసగాడని ఇంటెలిజెన్స్‌ అధికారులు హెచ్చరించడంతో పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..