ఔను మేమిద్దరం ఇష్టపడ్డాం.. ఒక్కటవ్వాలనుకుంటున్నాం.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఇద్దరబ్బాయిలు..

వారిద్దరూ ప్రేమించుకున్నారు. అమ్మాయి.. అబ్బాయి అయితే.. ఓకే అనుకోవచ్చు. కానీ, ఇద్దరు అబ్బాయిలు.. దీంతో వారికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతుండటం..

ఔను మేమిద్దరం ఇష్టపడ్డాం.. ఒక్కటవ్వాలనుకుంటున్నాం.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఇద్దరబ్బాయిలు..
Utkarsh Saxena, Ananya Kotia
Follow us

|

Updated on: Feb 04, 2023 | 8:12 AM

వారిద్దరూ ప్రేమించుకున్నారు. అమ్మాయి.. అబ్బాయి అయితే.. ఓకే అనుకోవచ్చు. కానీ, ఇద్దరు అబ్బాయిలు.. దీంతో వారికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతుండటం.. అధికారికంగా ఈ పెళ్లికి అనుమతి లేకపోవడంతో ఇద్దరు అబ్బాయిలు కలిసి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఉత్కర్ష్ సక్సేనా.. అనన్య కోటియాల ప్రేమకథ కూడా ఇతరుల వలే కాలేజీ రొమాన్స్ లాగానే మొదలైంది. ఈ స్వలింగ సంపర్కుల సంబంధం గురించి మరెవరికీ తెలియదు. వీదేశాల్లో చదువును అభ్యసిస్తున్న వీరు.. తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని.. అనుమతినివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

తాము గత 15 ఏళ్లుగా ప్రేమబంధంలో ఉన్నామని.. తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. స్వలింగ సంపర్క వివాహానికి అనుమతి ఇవ్వాలని వీరితోపాటు మరో మూడు జంటలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సర్వోన్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశాయి. అయితే.. ఈ పిటిషన్లు అన్నింటినీ మార్చిలో విచారణ చేస్తామని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. అయితే, ఈ వివాహాలకు చట్టబద్ధత లభిస్తే.. తైవాన్‌ తర్వాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారతదేశం నిలవనుంది.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ పాలసీ స్కాలర్ అయిన సక్సేనా మాట్లాడుతూ.. జరగబోయే పరిణామాల గురించి భయపడుతున్నామని.. ఏదో ఒక కోణంలో మా జంటను విడదీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అలాంటివి కోరుకోవడం లేదని పేర్కొన్నారు. సంవత్సరాలుగా, భారతీయ సమాజం స్వలింగ సంపర్కాన్ని ఎక్కువగా అంగీకరించడంతోపాటు దేశంలోని చాలామంది LGBTQ కమ్యూనిటీ వారి లైంగికతను బహిరంగంగా పేర్కొంటుండటంతో తమ మధ్య ఉన్న సంబంధాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని నిర్ణయించుకున్నామన్నారు. అయితే, ఇలా చెప్పిన క్రమంలో చాలా మంది అంగీకరించారని.. పలువురు నిరాకరించామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..