Baba Ramdev: మతం కంటే ముందు దేశం కావాలి.. టీవీ9 గ్లోబల్ సమ్మిట్ లో బాబా రామ్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్య

2040 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ శక్తిగా అవతరించనుందని యోగా గురు రామ్‌దేవ్ బాబా(Ramdev Baba) అన్నారు. న్యూఢిల్లీలో TV9 నెట్‌వర్క్(Tv9 Network) నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్...

Baba Ramdev: మతం కంటే ముందు దేశం కావాలి.. టీవీ9 గ్లోబల్ సమ్మిట్ లో బాబా రామ్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్య
Baba Ravdev
Ganesh Mudavath

|

Jun 19, 2022 | 5:19 PM

2040 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ శక్తిగా అవతరించనుందని యోగా గురు రామ్‌దేవ్ బాబా(Ramdev Baba) అన్నారు. న్యూఢిల్లీలో TV9 నెట్‌వర్క్(Tv9 Network) నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో బాబా రామ్‌దేవ్, రమేష్ భాయ్ ఓజా ఈ వ్యాఖ్యలు చేశారు. మతం అనేది తీవ్రవాదానికి సంబంధించిన అంశం కాదన్న ఓజా కరుణకు సంబంధించిందని చెప్పారు. మత మార్పిడి గురించి రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ మతం కంటే ముందు దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మత మార్పిడి అనేది ఎజెండా కాదన్న రామ్ దేవ్..కానీ దేశంలో కొంతమందికి ఒకే ఎజెండా ఉందని, ప్రధాని నరేంద్ర మోదీని తొలగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన మతం సర్వోన్నతమైనదన్న రామ్ దేవ్.. మన మతం మాత్రమే గొప్పగా ఒక్కటే ఉత్తమమైనదిగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హింసతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎవరూ ప్రయత్నించలేరని రామ్‌దేవ్ అన్నారు. ప్రజల మృతదేహాలపై అధికారం సంపాదించే నాయకులు ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. హింస ద్వారా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరూ ప్రయత్నించలేరని బాబా రామ్ దేవ్ మరోసారి స్పష్టం చేశారు.

పూజా పద్ధతులు మారాయి కానీ పూర్వీకులు మారలేరు. మతం కంటే ముందు దేశం రావాలి. ఎవరైనా మక్కా మదీనాకు వెళ్లాలి.. కానీ మక్కా మదీనా కంటే ముందు భారతదేశం అతని మక్కా మదీనాగా ఉండాలి. అతని ప్రవక్త గురించి మనం ఏమీ చెప్పలేనప్పుడు అతను మన గొప్ప వ్యక్తుల గురించి కూడా ఏమీ చెప్పకూడదు. అలాంటి కొన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. వాటి కారణంగా ప్రజల పూజా విధానాలు మారాయి కానీ పూర్వీకులు మారలేరు.

– యోగా గురు బాబా రామ్ దేవ్ బాబా

భారతీయులందరి పూర్వీకులు ఒకటేనన్న బాబా రామ్ దేవ్.. సామాజిక, ఆర్థిక కారణాల వల్ల వారి మతం మారిపోయిందని అన్నారు. మతం తీవ్రవాదానికి సంబంధించినది కాదని, కరుణకు సంబంధించినదని ఓజా చెప్పారు. దేవునిపై ప్రేమ మతమన్న ఆయన.. మతం తీవ్రవాదానికి సంబంధించినది కాదు, కరుణకు సంబంధించినదని మరోసారి ఉద్ఘాటించారు. మత మార్పిడిని ఏ మతం సహించదని తేల్చి చెప్పారు. విశ్వగురువు కావడానికి భారతదేశానికి శక్తి, ధైర్యం ఉందని అన్నారు. పెట్రోల్ ధరలపై 2014కు ముందు చేసిన వాదనల గురించి అడిగినప్పుడు ఈ సమయంలో అధికారంలో ఉన్నవారి ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయని నాతో సహా భారతదేశంలోని చాలా మంది ప్రజలు భావిస్తున్నారని బాబా రామ్‌దేవ్ అన్నారు. వాటిని చూడటం మా పూర్తి సమయం పని కాదు. ఉద్యమం మా పార్ట్ టైమ్ ఉద్యోగం.. దేశ నిర్మాణం మా పూర్తి సమయం ఉద్యోగమని వివరించారు.

మరోవైపు.. అల్లోపతి వైద్యంపై బాబా రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అల్లోపతి వైద్యం, వైద్యులను అవమానించేలా బాబా రామ్‌దేవ్‌ మాట్లాడారని భారత వైద్య సంఘం(ఐఎంఏ) తీవ్రంగా ఆరోపించింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ తక్షణం స్పందించి ఆయనపై కేసు నమోదుచేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

కాగా బాబా రామ్‌దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పందించారు. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని రామ్‌దేవ్‌కు సూచిస్తూ లేఖ రాశారు. దీంతో బాబా రామ్‌దేవ్‌ అల్లోపతి వైద్యంపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu