BrahMos missile: మరో రెండేళ్లలో బ్రహ్మోస్ 2.O .. హైలెట్స్ ఏంటో తెల్సా..?
ఖబడ్దార్ పాకిస్తాన్. మీ భూభాగంలోని ప్రతి అంగుళం మా బ్రహ్మోస్ పరిధిలో ఉంది. తోక జాడిస్తే తోలు తీస్తాం. అంటూ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ దాయాదిదికి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతటి శక్తివంతమైన బ్రహ్మోస్, మరో రెండేళ్లలో అప్‌గ్రేడ్ వెర్షన్ రాబోతోంది. మామూలుగా వెర్షన్‌కు పాకిస్తాన్‌కు చెమటలు పట్టించిన బ్రహ్మోస్ అప్‌గ్రేడ్ వెర్షన్ 2.O సిద్ధమైతే శత్రుదేశాలకు దిమ్మ తిరిగి బొమ్మ కనడపటం ఖాయమంటున్నారు నిపుణులు. మరి బ్రహ్మోస్ 2.Oలో ఉన్న హైలెట్స్ ఏంటి..?

భారత సైన్యంలోకి త్వరలో 800 కిలోమీటర్ల రేంజ్ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు చేరబోతున్నాయి. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి పరిధి 450 కి.మీ. ఇది శబ్దవేగం కంటే రెండు రెట్లు వేగంతోలక్ష్యాలను చేదించగలదు. కొత్త వెర్షన్‌లో ఇంతకుమించిన టెక్నాలజీతో బ్రహ్మోస్ సిద్ధం కానుంది . ర్యామ్‌జెట్ ఇంజిన్, అధునాతన నావిగేషన్ వ్యవస్థలు ఉంటాయి. ప్రస్తుతం క్షిపణి పరీక్షలు జరుగుతున్నాయి. 2027 నాటికి పూర్తిస్థాయిలో సేవలోకి రానుంది. “కొత్త బ్రహ్మోస్ కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తోనే పాత లాంచర్లలో వినియోగించవచ్చంటున్నారు నిపుణులు.
ఇప్పటికే బ్రహ్మోస్ 2.Oకు సంబంధించిన అభివృద్ధి దాదాపు పూర్తైపోయింది. దీనిలోని ఇనర్షల్ నేవిగేషన్ వ్యవస్థ-ఎక్స్‌టర్నల్ గ్లోబల్ నేవిగేషన్ వ్యవస్థ కాంబినేషన్‌కు సంబంధించిన పరీక్షలు జరగాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి విజయవంతమైతే..డైరెక్ట్‌గా 800 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ వేరియంట్‌నే సాఫ్ట్‌వేర్, ఫైర్ కంట్రోల్ వ్యవస్థల్లో మార్పులు చేసి రేంజిని పెంచుతారని తెలుస్తోంది. క్షిపణి డిజైన్, లాంచర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. తర్వాత ఆర్మీ వినియోగించే వేరింయట్‌ను..వాయుసేన వాడే వేరియంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇక డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రా మార్క్–2 క్షిపణి 200 కి.మీ. కంటే ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది. వాయుసేన ఇప్పటికే 100 కి.మీ. పరిధి గల ఆస్ట్రా మార్క్–1 క్షిపణులను సర్వీసులోకి తీసుకుంది. కొత్త ఆస్ట్రా క్షిపణులు సుఖోయ్–30ఎంకెఐ, తేజస్ యుద్ధవిమానాల కోసం రూపొందించబడతాయి. ఇవి విదేశీ రష్యన్, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ BVRAAM క్షిపణులను రీప్లేస్ చేస్తాయి. భవిష్యత్తులో మార్క్–3 వేరియంట్ 350 కి.మీ. పరిధితో సాలిడ్ ఫ్యూయల్ ర్యామ్‌జెట్ టెక్నాలజీతో రానుంది.
ఇండో–రష్యన్ జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇప్పటివరకు రూ. 58,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. గత సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖ రూ. 19,519 కోట్లతో 220 బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం చేసింది. ప్రస్తుతం నేవీకి చెందిన సుమారు 20 యుద్ధ నౌకలు బ్రహ్మోస్ లాంచ్ వ్యవస్థలతో అమర్చబడ్డాయి. ఆపరేషన్ సిందూర్ విజయవంతం తరువాత, వాయుసేన కోసం మరో 110 ఎయిర్–లాంచ్‌డ్ బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు రూ. 10,800 కోట్ల ప్రాథమిక ఆమోదం కూడా లభించింది. సో..భారత్ స్వదేశీ రక్షణ సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేస్తోంది. బ్రహ్మోస్ , ఆస్ట్రా ప్రాజెక్టులు దేశ రక్షణ రంగంలో గేమ్‌చేంజర్ అంటున్నారు నిపుణులు




