లవ్‌జిహాద్‌ను వ్యతిరేకించాలి.. పిల్లలు వినకపోతే కాళ్లు విరగొట్టాలన్న ప్రజ్ఞా ఠాకూర్
బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ బాలికల తల్లిదండ్రులకు షాకింగ్ సూచనలు ఇచ్చారు. ఒకవేళ మీ కుమార్తె మీ మాట వినకుండా ఇతర మతస్తుల ఇళ్లలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే.. వారి కాళ్లను విరగ్గొట్టి, ఇంట్లో నుంచి బయటకు పోకుండా కాపాడుకోవాలన్నారు.

బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ బాలికల తల్లిదండ్రులకు షాకింగ్ సూచనలు ఇచ్చారు. ఒకవేళ మీ కుమార్తె మీ మాట వినకుండా ఇతర మతస్తుల ఇళ్లలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే.. వారి కాళ్లను విరగ్గొట్టి, ఇంట్లో నుంచి బయటకు పోకుండా కాపాడుకోవాలన్నారు. అప్పుడే మీ కుటుంబం సురక్షితంగా ఉంటుందన్నారు.
బీజేపీ మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ కుమార్తెల పెంపకం, “లవ్ జిహాద్” గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. లవ్‌జిహాద్ భూతం నుంచి హిందూ బాలికలను కాపాడాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉందని ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు. తమ మాటలు పిల్లలు వినకపోతే వాళ్ల కాళ్లను విరగొట్టి, ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల మార్గదర్శకత్వాన్ని పాటించడానికి నిరాకరిస్తే, వేరే మతానికి చెందిన వ్యక్తితో సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తే, ఆమె ప్రవర్తనను సరిదిద్దడానికి కుటుంబం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
హింసను ప్రేరేపించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రజ్ఞ ఠాకూర్ లవ్‌జిహాద్ భూతం నుంచి హిందూ బాలికలు, యువతులను రక్షించుకోవాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో అలజడి రేపుతున్నాయి. హిందూ యువతులు ఇతర మతాల యువకులను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఠాకూర్ సూచించారు.
వీడియో చూడండి..
View this post on Instagram
కూతురు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆమెను లక్ష్మీ, సరస్వతి రూపంగా భావించి సంబరపడతారని ఈ సందర్భంగా ప్రజ్ఞా ఠాకూర్ గుర్తు చేశారు. అలాంటి కూతురు పెరిగి పెద్దయ్యాక మరో మతస్తుడికి భార్య కావడానికి ఎలా సిద్ధపడుతుందని ఆమె ప్రశ్నించారు. అటువంటి పరిస్థితుల్లో ఆ బాలికలను ఆపడం తల్లిదండ్రుల బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ప్రజ్ఞాఠాకూర్‌కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు.. మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




