India Coronavirus: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు.. గత 24గంటల్లో..
Covid-19 Updates: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో
Covid-19 Updates: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 30,256 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 295 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,478,419 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,45,133 చేరింది. నిన్న కరోనా నుంచి 43,938 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,27,15,105 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,18,181 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
కాగా.. కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో.. కేరళలో 19,653 కరోనా కేసులు నమోదు కాగా.. 152 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80 శాతం కరోనా కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి.
ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 80,85,68,144 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 37,78,296 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.
India reports 30,256 fresh cases of #COVID19, 43,938 recoveries, and 295 deaths in the last 24 hours
Total cases: 33,478,419 Total Active cases: 3,18,181 Total Recoveries: 3,27,15,105 Total Death toll: 4,45,133
Total vaccination : 80,85,68,144 (37,78,296 in last 24 hours) pic.twitter.com/MTf1Qrrxwh
— ANI (@ANI) September 20, 2021
Also Read: