Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే రాష్ట్ర బాధ్యత ఎవరు తీసుకుంటారు..! ఎటువంటి అధికారాలు ఉంటాయి..

Chief Minister Resigns: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చాలా

ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే రాష్ట్ర బాధ్యత ఎవరు తీసుకుంటారు..! ఎటువంటి అధికారాలు ఉంటాయి..
Chief Minister
Follow us
uppula Raju

|

Updated on: Sep 20, 2021 | 9:40 AM

Chief Minister Resigns: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చాలామందిని ఒక సందేహం వెంటాడుతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోకుండా రాజీనామా చేస్తే రాష్ట్ర బాధ్యతలను ఎవరు చూసుకుంటారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక వరకు రాష్ట్ర పరిస్థితి ఏంటి. శాంతి భద్రతలను ఎవరు అదుపు చేస్తారు. వీటన్నిటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేంతవరకు అతడే రాష్ట్రానికి తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉంటారు.

రాష్ట్ర గవర్నర్‌కు ముఖ్యమంత్రి తన రాజీనామాను సమర్పించినప్పుడు కొత్త సీఎం ఏర్పడే వరకు రాష్ట్ర బాధ్యతను నిర్వహించాలని గవర్నర్ ఆదేశిస్తారు. అయితే రాష్ట్రపతి పాలనలో ఇది జరగదు. ఎందుకంటే అధికారం గవర్నర్ చేతిలో ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని పనులను పర్యవేక్షించే బాధ్యతను అతనే చూసుకుంటాడు. అలాగే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తే రాష్ట్రపతి అతడిని తాత్కాలిక ప్రధాన మంత్రిగా పనిచేయమని ఆదేశిస్తారు. కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం తర్వాత మాత్రమే అతను తన బాధ్యతల నుంచి తప్పుకుంటారు.

ప్రభుత్వ పదవీకాలం ముగిసిన సందర్భంలో ఈ నియమం రాజీనామా సమయంలో మాత్రమే కాదు.. ఎన్నికల సమయంలో కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ వ్యవధి ముగిసి కొన్ని కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాత ముఖ్యమంత్రినే బాధ్యతలు చూడమని గవర్నర్ ఆదేశిస్తారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకోగలరా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అధికారాలు పరిమితంగా ఉంటాయి. వారు ఏ కొత్త పథకాన్ని ప్రారంభించలేరు. అయితే శాంతిభద్రతల పరిరక్షణ వారి బాధ్యత. వారు ఇప్పటికే నడుస్తున్న పథకాలను పర్యవేక్షించవచ్చు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తరువాత అతని బాధ్యత ముగుస్తుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినట్లయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అధికారాలు రద్దవుతాయి. పరిపాలన మొత్తం గవర్నర్‌ చేతిలోకి వెళుతుంది.

ఈ 5 సుగంధ ద్రవ్యాలతో సులువుగా బరువు తగ్గవచ్చు..! కొద్ది రోజుల్లోనే తేడా గమనిస్తారు..

Oil Purify Test vide: మీరు వాడే నూనె స్వచ్ఛమైనదేనా.. తెలుసుకోండి ఇలా..!(వీడియో)

ORR Car Fire: ఓ డాక్టర్ ప్రాణాన్ని బలిగొన్న ఎలుకలు.. కారులో వ్యక్తి సజీవదహనం దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు..!