India Corona: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య.. కొత్తగా ఎన్నంటే.!

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. రోజూవారీ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో..

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య.. కొత్తగా ఎన్నంటే.!
Us Corona
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 26, 2021 | 10:27 AM

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. రోజూవారీ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తే.. మరో రోజు కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా మరోసారి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28,326 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు మహమ్మారి బారినపడి 260 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,476కి చేరింది. అలాగే మరణాల సంఖ్య 4,46,918కి చేరుకుంది.

నిన్న కరోనా నుంచి 26,032 మంది కోలుకున్నారు. దీనితో ఇప్పటివరకు దేశంలో మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,29,02,351కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,03,476కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత కొద్ది రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంతలా తగ్గడం గమనార్హం. అటు కేరళలో అయితే మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్న 15,768 పాజిటివ్ కేసులు బయటపడగా.. 214 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85,60,81,527 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 68,42,786 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

కరోనా అప్‌డేట్:

మొత్తం కేసులు: 3,36,52,745 యాక్టివ్ కేసులు: 3,03,476 మొత్తం రికవరీ: 3,29,02,351 మొత్తం మరణాలు: 4,46,918 మొత్తం టీకాలు: 85,60,81,527

ఇవి కూడా చదవండి:  AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ దిగ్గజం కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ దిగ్గజం కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!