Covid 4th Wave: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. గత 24గంటల్లో ఎంతమంది చనిపోయారంటే..?
శనివారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. రికవరీల సంఖ్య భారీగా పెరుగుతోంది.
India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజల నుంచి దేశంలో 20 వేలకు దిగువన కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా.. శనివారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. రికవరీల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,092 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,16,861 (0.26 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.69 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది.
దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా గణాంకాలు..
- దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,42,53,464 కి పెరిగింది.
- కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,27,037 కి చేరింది.
- నిన్న కరోనా నుంచి 16,454 మంది కోలుకున్నారు.
- వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,36,09,566 కి చేరింది.
- దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 207.99 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
- దేశంలో నిన్న 28,01,457 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
India reports 14,092 new COVID19 cases in the last 24 hours; Active caseload at 1,16,861 pic.twitter.com/vqVvHyHF3l
— ANI (@ANI) August 14, 2022
నిన్న నమోదైన కేసుల్లో ఢిల్లీలో అత్యధికంగా 2,031 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2040, కర్ణాటకలో 1,329, కేరళలో 1081 కేసులు నమోదయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..