AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyank Kharge: ‘ఇది లంచం-మంచం ప్రభుత్వం’.. దుమారం రేపుతున్న కాంగ్రెస్ ముఖ్య నేత కామెంట్స్..

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక్‌ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై ఆయన చేసిన లంచం-మంచం కామెంట్స్‌ దుమారం రేపాయి.

Priyank Kharge: ‘ఇది లంచం-మంచం ప్రభుత్వం’.. దుమారం రేపుతున్న కాంగ్రెస్ ముఖ్య నేత కామెంట్స్..
Priyank Kharge
Shaik Madar Saheb
|

Updated on: Aug 14, 2022 | 8:12 AM

Share

Priyank Kharge: కర్ణాటకలో గవర్నమెంట్‌ జాబ్‌ రావాలంటే యువకులు లంచం ఇవ్వాలి. యువతులైతే మరో రకంగా సహకరించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతినిధి ప్రియాంక్‌ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నియామకాల విషయంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక్‌ ఖర్గే.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే తనయుడు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కలబురగిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖర్గే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని ప్రకటించుకున్న బసవరాజ్‌ బొమ్మై పాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఖర్గే విమర్శించారు. ప్రభుత్వం అన్ని ఉద్యోగాలను తమకు ఇష్టం వచ్చిన రేటుకు అమ్మేస్తోందని ఆరోపించారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని లంచం-మంచం ప్రభుత్వమని అనేందుకు వెనకాడనని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు మగాళ్లయితే లంచం ఇవ్వాల్సి వస్తోందని, ఆడవాళ్లయితే అయితే వారిపై మరో రకమైన ఒత్తిడి వస్తోందన్నారు.

ప్రియాంక్‌ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇలాంటి విమర్శలు చేసే ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని చెప్పింది. కాంగ్రెస్‌ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన అనేక సీడీలు ఉన్నాయని పేర్కొంది. ఖర్గే మహిళలను దారుణంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే మహిళా లోకానికి ఆయన క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్‌ పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌కు సారథ్యం వహిస్తున్నది ఒక మహిళ అని ఖర్గే గుర్తుంచుకోవాలని బీజేపీ నేత సంబిత్‌ పాత్రా అన్నారు. ఖర్గేపై జాతీయ మహిళా కమిషన్‌ చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం