Independence Day 2022: స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట.. ఎటుచూసినా మువ్వన్నెల రెపరెపలే..
Independence Day 2022: దేశవ్యాప్తంగా స్వాంతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Independence Day 2022: దేశవ్యాప్తంగా స్వాంతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వేడుకల కోసం ఎర్రకోట మువ్వన్నెలతో ముస్తాబైంది. ఫుల్ డ్రెస్ రిహార్సల్ పూర్తయింది. ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర్య వేడుకలకు ఏడు వేల మంది ఆహ్వానితులు హాజరు కానున్నారు. భద్రత కోసం సుమారు పది వేల మంది పోలీసులను మోహరించనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాంతో ఎర్రకోట ప్రవేశ ద్వారం దగ్గర మల్టీ లేయర్ సెక్యూరిటీ కవర్ ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలను వాడుతున్నారు.
అలాగే, ఎర్రకోట చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వరకు నో కైట్ ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లను కూడా ఇన్‌స్టాల్ చేశారు. త్రివిధ దళాల సిబ్బంది, ఎన్‌సీసీ కేడెట్స్ ఫుల్‌డ్రెస్ రిహార్సల్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎర్రకోటపై ఎగురుతున్న జాతీయ పతాకంపై మిలిటరీ హెలికాప్టర్ పూలజల్లు కురిపించింది. వీవీఐపీల ఎస్కార్ట్‌కు సంబంధించి ఎస్పీజీ కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓవరాల్‌గా రేపు జరగనున్న ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలకు అంతా సిద్ధమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..