Montenegro Shooting: మోంటెనెగ్రోలో రెచ్చిపోయిన దుండగుడు.. ప్రజలపై కాల్పులు.. 11 మంది మృతి..

దుండగుడి కాల్పుల్లో 11 మంది మరణించారని మోంటెనెగ్రో పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ తెలిపింది. ఈ ఘటనలో ఓ పోలీసు సహా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

Montenegro Shooting: మోంటెనెగ్రోలో రెచ్చిపోయిన దుండగుడు.. ప్రజలపై కాల్పులు.. 11 మంది మృతి..
Montenegro Shooting
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 14, 2022 | 8:01 AM

Montenegro Shooting: ఆగ్నేయ ఐరోపాలోని మోంటెనెగ్రో దేశంలో కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడి కాల్పుల్లో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన మాంటెనెగ్రోలోని సెంట్రల్ సిటీ సెటింజేలో శుక్రవారం జరిగింది. దుండగుడి కాల్పుల్లో 11 మంది మరణించారని మోంటెనెగ్రో పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ తెలిపింది. ఈ ఘటనలో ఓ పోలీసు సహా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో షూటర్‌ను హతమయ్యాడు. రాజధాని పోడ్గోరికాకు పశ్చిమాన 36 కిలోమీటర్ల (22 మైళ్ళు) దూరంలో ఉన్న సెటిన్జేలో ఈ సంఘటన జరిగింది. కుటుంబ వివాదం అనతంరం దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడని.. అందరిపై కాల్పులు జరుపుకుంటూ తిరిగాడని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో ఓ పౌరుడు సహకరించడంతో అతన్ని అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటన అడ్రియాటిక్ దేశంలో దశాబ్దాలలో జరిగిన అత్యంత ఘోరమైనదిగా పేర్కొన్నారు. ఈ ఘటనపై మోంటెనెగ్రో ప్రెసిడెంట్ మిలో డుకనోవిక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు నివాళులర్పించి.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మోంటెనెగ్రో దేశం పర్వతాలతో పెనవేసుకున్న సుందరమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. టూరిజం స్పాట్‌గా ఉన్న ఈ దేశంలో అత్యధికంగా షూటింగ్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో కాల్పులు జరగడం కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం