AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ ఎయిర్ బేస్ పై డ్రోన్లతో దాడి.. ఐరాసలో భారత్ ఆందోళన.. నివారించాలని అభ్యర్థన

జమ్మూ లోని ఎయిర్ బేస్ పై డ్రోన్ల దాడి ఘటనపై భారత్... ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

జమ్మూ ఎయిర్ బేస్ పై డ్రోన్లతో దాడి.. ఐరాసలో భారత్ ఆందోళన.. నివారించాలని అభ్యర్థన
Jammu Air Base Attack
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 29, 2021 | 1:42 PM

Share

జమ్మూ లోని ఎయిర్ బేస్ పై డ్రోన్ల దాడి ఘటనపై భారత్… ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డ్రోన్లను వినియోగించడం దారుణమని…దీనిపై ప్రపంచ దేశాలు..ఐరాస దృష్టి పెట్టాలని భారత హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన స్పెషల్ సెక్రటరీ (ఇంటర్నల్ సెక్యూరిటీ) వీ.ఎస్.కె. కౌముది కోరారు. టెర్రరిస్ట్ ప్రాపగాండా కోసం ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు నిధులు అందజేయడం, క్రౌడ్ ఫండింగ్ వంటి వాటికి అదుపు లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. జనరల్ అసెంబ్లీలో సభ్య దేశాలకు చెందిన కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీ హెడ్స్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. జమ్మూ ఎయిర్ బేస్ పై డ్రోన్ల దాడిని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ…తక్కువ ధరకు..సులభంగా లభించే సాధనాలైన వీటిని ఉగ్రవాద బృందాలు వినియోగించుకుంటున్నాయని అన్నారు. ఆయుధాలు, బాంబులను జారవిడవడానికి వీటిని వారు ఉపయోగిస్తున్నారని, ఈ విధమైన పోకడకు అడ్డుకట్ట వేయవలసి ఉందని చెప్పారు.

భారత సరిహద్దుల్లో ఆయుధాలను స్మగుల్ చేయడానికి వీటిని వాడుతున్న ఉదంతాలను తాము చూస్తున్నామని కౌముది పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు జామున జమ్మూ ఎయిర్ బేస్ పై డ్రోన్లు జారవిడిచిన పేలుడు పదార్థాల కారణంగా ఇద్దరు వైమానిక దళ ఉద్యోగులు గాయపడ్డారు. నిన్న కూడా జమ్మూలోని కలుచౌక్ మిలిటరీ కేంద్రంపై రెండు డ్రోన్లు ఎగరగా వాటిని కూల్చివేయడానికి జవాన్లు చేసిన యత్నాలు ఫలించలేదు.. సుమారు 25 రౌండ్ల కాల్పులు జరిపినా ప్రయోజనం లేకపోయింది.

మరిన్ని ఇక్కడ చూడండి: మధ్యప్రదేశ్ లోనూ ఫేక్ వ్యాక్సినేషన్..13 ఏళ్ళ బాలుడికి టీకామందు.. వయస్సు 56 అట

Murder: విశాఖ ఏజెన్సీలో దారుణం.. ఆస్థి కోసం అన్నను కత్తితో నరికి చంపిన తమ్ముడు..