AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థానేలో మహిళకు నిముషాల వ్యవధిలో మూడు వ్యాక్సిన్లు… సిబ్బంది నిర్వాకం…

మహారాష్ట్రలోని థానేలో ఓ మహిళకు కేవలం కొన్ని నిముషాల వ్యవధిలో మూడువ్యాక్సిన్లు ఇచ్చారు. 28 ఏళ్ళ ఈ మహిళ... ఈ వైనంపై మున్సిపల్ ఉద్యోగి అయిన తన భర్తకు చెబుతూ ఆందోళన వ్యక్తం చేసింది..

థానేలో మహిళకు నిముషాల వ్యవధిలో మూడు వ్యాక్సిన్లు... సిబ్బంది నిర్వాకం...
Woman Gets 3 Vaccines
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 29, 2021 | 2:45 PM

Share

మహారాష్ట్రలోని థానేలో ఓ మహిళకు కేవలం కొన్ని నిముషాల వ్యవధిలో మూడువ్యాక్సిన్లు ఇచ్చారు. 28 ఏళ్ళ ఈ మహిళ… ఈ వైనంపై మున్సిపల్ ఉద్యోగి అయిన తన భర్తకు చెబుతూ ఆందోళన వ్యక్తం చేసింది. తన ఆరోగ్యంపై కలత చెందుతున్నట్టు వెల్లడించింది. దీంతో ఆయన వెంటనే మొదట స్థానిక కార్పొరేటర్ కి, ఆ తరువాత ఉన్నతాధికారులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. కానీ తాను స్వయంగా కంప్లయింట్ ఇవ్వడానికి ఆ మహిళ నిరాకరించింది. ఇలా చేస్తే తన భర్త ఉద్యోగానికి ముప్పు వస్తుందేమోనని భయపడుతున్నట్టు ఆమె పేర్కొంది. అటు-తన భార్య మొదటిసారిగా టీకామందు తీసుకుందని, ఎన్ని సార్లు తీసుకోవాలో ఆమెకు తెలియదని ఆమె భర్త చెప్పాడు. అయితే ఆ మహిళ ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్య బృందం ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలిపింది. అయినా మరో 48 గంటల పాటు ఆమె హెల్త్ ని పర్యవేక్షిస్తామని వారు తెలిపారు. ఏమైనా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెల్త్ కేర్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

ఈ ‘ఘటన’ పై స్థానిక బీజేపీ నేతలు.. మున్సిపల్ కమిషనర్ ని ఘెరావ్ చేశారు.. వ్యాక్సినేషన్ సెంటర్ స్టాఫ్ నిర్లక్ష్యం పై తీవ్ర నిరసన తెలిపారు. కాగా మహారాష్ట్రలోనే లోగడ 70 ఏళ్ళ ఓ వ్యక్తికి కొద్ది సమయంలోనే రెండు వ్యాక్సిన్లు ఇచ్చారు. ఫలితంగా ఆయన ఒంటిపై దద్దుర్లు వచ్సినట్టు ఆయన కుమారుడు తెలిపాడు. కాగా ఇతర కారణాలు కూడా ఉండవచ్చునని వైద్య బృందం తెలిపింది. ఇంతకు మించి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వివరించింది. ఏమైనా.థానేలో ఈ మహిళకు .ఒకేసారి మూడు వ్యాక్సిన్లు ఇవ్వడం మాత్రం కలకలం రేపుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: TOSS: అందరూ పాస్.. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు

Chardham Yatra 2021: ఉత్త‌రాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చార్‌ధామ్ యాత్ర‌ వాయిదా..