India Population: పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి.. లేటెస్ట్ స్లోగన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

ఒక్కర్నే కనండి.. జనాభా తగ్గించండి.. ఒకప్పటి స్లోగన్..! పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి.. లేటెస్ట్ స్లోగన్..! యువత కారణంగానే జపాన్‌ స్థానానికి చైనా.. చైనాలో యువత తగ్గితే.. ఆ స్థానానికి భారత్.. 2047 నాటికి భారత్‌లో పెరగనున్న వృద్ధులు.. పాతికేళ్ల తరువాత భారత్‌దీ జపాన్, చైనా పరిస్థితే..! అందుకే.. ముందు జాగ్రత్తగా 'పిల్లల్ని కనండి' అంటూ స్లోగన్స్..!

India Population: పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి.. లేటెస్ట్ స్లోగన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
Indian Population
Follow us

|

Updated on: Oct 21, 2024 | 9:22 PM

Have fewer children..? raise more pigs..! పిల్లల్ని కనకపోయినా ఫర్వాలేదు.. వాళ్ల ప్లేస్‌లో పందుల్ని పెంచుకోండి అని ఒకప్పుడు చైనా ఇచ్చిన స్లోగన్. 1979లో చైనాలో మోస్ట్‌ పాప్యులర్‌ స్లోగన్‌ ఇది. దాన్నుంచి వచ్చిందే.. One family- One child policy. చైనాలో.. కంటే ఒక్కరినే కనాలి. పొరపాటున ఇంకొకరికి జన్మనిచ్చారా.. ఆ గ్రామంలోని అందరికీ ఆపరేషన్లే. వేసక్టమీ లేదా ట్యూబెక్టమీ. అంత కఠినంగా వ్యవహరించింది చైనా. కాని, ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటో తెలుసా. ప్లీజ్.. పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, అవసరమైతే లీవ్స్‌ పెట్టండని అంటోంది. ఎందుకని ఈ మార్పు..! యువత తగ్గిపోతున్న కారణంగా చైనా జీడీపీ కూడా తగ్గుతోంది కాబట్టి. ఇక జపాన్. అమెరికా తరువాత అత్యంత శక్తివంతమైన దేశం. ఎకానమీలో అమెరికా తరువాత జపానే. కాని, చేజేతులా ఆ ప్లేస్‌ను చైనాకు ఇచ్చేసింది. 2010 తరువాత ఆ సెకండ్ ప్లేస్‌ను చైనా లాగేసుకుంది. కారణం.. జపాన్‌లో పిల్లల సంఖ్య తగ్గడం. యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగినందుకు.. జపాన్ ఆర్థిక వ్యవస్థే కుచించుకుపోయింది. ఇక ఇండియా. అతి త్వరలోనే జర్మనీని క్రాస్‌ చేసి జపాన్‌ ప్లేస్‌లోకి వెళ్లబోతోంది. మూడునాలుగేళ్లలో టాప్-3 ఎకానమీగా ఇండియా ఉండబోతోంది ఇండియా. కారణం.. యూత్ ఎక్కువగా ఉండడం. యువత లేని దేశాలు ఆర్థికపరంగా ఎలా కిందకు పడిపోతున్నాయో స్వయంగా చూస్తున్నాం. అదే యువత ఉన్న కారణంగా ఆర్థికంగా ఇండియా ఎలా ఎదుగుతోందో కూడా చూస్తున్నాం. కాని, ఇక్కడే ఓ డౌట్‌ వస్తోంది కొందరికి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే హవా. కథ రాయాలా.. జస్ట్‌ నోట్స్ ఇస్తే చాలు వచ్చేస్తుంది. బొమ్మ గీయాలా.. ఎలా కావాలో చెబితే చాలు గీసి ఇచ్చేస్తుంది. ఇళ్లు కట్టాలా త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ ఆల్రడీ వచ్చేసింది. అదే ఇల్లు కట్టించి ఇస్తుంది. ఏం చేయాలన్నా టెక్నాలజీ ఉంది. మరి అలాంటప్పుడు ఇక యూత్‌తో పనేముంది? ఏం.. యువత తగ్గినంత మాత్రాన చైనా, జపాన్, జర్మనీకి వచ్చిన ఇబ్బందేంటి? ఇప్పటికీ అవి టాప్‌ పొజిషన్‌లోనే ఉన్నాయ్‌ కదా..! వాటికి లేని ఇబ్బంది మనకేంటి? అని అడుగుతున్నారు. సో, ఇవాళ్టి మన టాపిక్ కూడా యూత్ వర్సెస్ ఓల్డ్ గురించే. మరీ ఓల్డ్‌ గురించి కాదు గానీ.. మధ్యవయసు దాటాక ఇక వారితో పన్లేదా? అందరికీ యూత్ మాత్రమే కావాలా? ఒక్క యూత్‌ కారణంగానే దేశాలు అభివృద్ధి చెందుతాయా? స్టాటిస్టిక్స్‌ ఏం చెబుతున్నాయో, ఏం కన్‌క్లూజన్‌ ఇస్తున్నాయో చూద్దాం.. ఇవాళ్టి ఎక్స్‌క్లూజివ్‌లో.

సీఎం చంద్రబాబు ఈమధ్య ఓ స్లోగన్‌ ఇస్తున్నారు. ‘దయచేసి ఒకరిద్దరు పిల్లలతోనే ఆగిపోకండి.. ముగ్గురు నలుగురైనా ఫర్వాలేదు కనండి’ అంటున్నారు. 2014లో సీఎం అయిన తరువాత కూడా ఇదే మాట అన్నారు. ఇప్పుడూ అదే మాట అంటున్నారు. కాకపోతే.. గతం కంటే ఇంకాస్త సీరియస్‌గా. ఓవైపు దేశ జనాభా పెరిగిపోతోంది మొర్రో అని మొత్తుకున్న మనమే.. ఇవాళ జనాభాను పెంచండి అని అంటున్నాం. కారణం ఏంటి? ఎందుకంటే.. ఇక్కడ కూడా వృద్ధాప్య సమస్య తాలూకు సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. దక్షిణ భారతదేశంలో మధ్య వయసు వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారిప్పుడు. 2047 నాటికి.. వీళ్లంతా వృద్ధుల జాబితాలోకి వెళ్తారు. సంతానోత్పత్తి రేటులో జాతీయ సగటు 2.1 ఉంటే.. సౌత్‌ ఇండియాలో సంతానోత్పత్తి రేటు 1.6కి పడిపోయింది. అంటే.. ఏపీతో సహా దక్షిణాదిన వృద్ధాప్య సమస్య సంకేతాలు కనిపించడం మొదలైందన్నమాట. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల జపాన్, చైనా, కొరియా, ఫిన్లాండ్‌, జర్మనీ వంటి ఎన్నో దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇండియాలో యూత్‌ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేం లేదు. మన దగ్గరున్న యూత్ సగటు వయసు 29 సంవత్సరాలు. ప్రపంచంలో మరే దేశంలో లేని యూత్‌ ఇండియాలోనే ఉన్నారు. 2047 వరకు జనాభాపరంగా, యూత్‌ పరంగా మనకొచ్చిన ఇబ్బందేం లేదు. మరో పాతికేళ్ల వరకు ఇప్పుడున్న యువతే దేశాన్ని నడిపిస్తుంది. మరి ఆ తరువాత..? ఇప్పుడు యావరేజ్‌గా 29 ఏళ్లున్న వాళ్లు పాతికేళ్ల తరువాత రిటైర్మెంట్‌కు దగ్గరపడతారు. సో, 2047 తరువాత వృద్ధ భారతం తయారవొచ్చు. అలా కాకుండా ఉండాలంటే.. ఇదిగో ఇప్పటి నుంచే ఒక కుటుంబం ముగ్గురు నలుగురిని కనాలని చెబుతున్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదనే చట్టం ఉంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఏమంటున్నారో తెలుసా. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని. ‘పిల్లల్ని కనండి’ అని చెబుతున్న ప్రతిసారి అక్కడున్న ఆడవాళ్లు నవ్వుతున్నారు గానీ.. సీఎం చంద్రబాబు చెబుతున్నది ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ కోసం, దేశ భవిష్యత్‌ కోసమే. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌ది కూడా కాస్త విచిత్ర పరిస్థితి. ఇక్కడ చదువుకున్న వాళ్లు ఎక్కువ. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయిస్‌ ఎక్కువ. వీళ్లంతా పక్క రాష్ట్రాల్లో, అమెరికాలో సెటిల్‌ అయ్యారు. వాళ్ల తల్లిదండ్రులు మాత్రం ఏపీలోనే మిగిలిపోయారు. వాళ్లు పంపించే డబ్బుతోనే నెట్టుకొస్తున్నారు. సో, సంపద సృష్టించి, ఇక్కడే ఉద్యోగాలు కూడా సృష్టిస్తాం.. కాకపోతే పిల్లల్ని మాత్రం కాస్త ఎక్కువ మందిని కనండని అంటున్నారు సీఎం చంద్రబాబు.

ఇందాక ఓ క్వశ్చన్‌ వినిపించింది. ఏం.. యూత్ లేకపోతే దేశాలు అభివృద్థి చెందడం లేదా, చైనా-జపాన్ టాప్ పొజిషన్‌లో లేవా అని. ఇప్పటికైతే.. ధనిక దేశాల జాబితాలో చైనా, జపాన్ సెకండ్ అండ్ థర్డ్‌ పొజిషన్‌లో ఉన్నాయి. కాని, చైనా, జపాన్ ఆర్థికవ్యవస్థల స్పీడ్‌ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. కారణం.. యూత్ లేకపోవడమే. ఎప్పుడైనా సరే.. కొత్త టెక్నాలజీని అడాప్ట్‌ చేసుకునేదే యూత్. కొత్త టెక్నాలజీతో వచ్చే వస్తువులను కొనేదే యువత. వాళ్లే లేటెస్ట్ టెక్నాలజీ వెంట పడకపోతే.. ఇక వాటిని తయారు చేయాల్సిన అవసరం ఏంటి? అదే జరిగితే.. కొత్తగా కనిపెట్టడం కూడా అనవసరమే కదా. రీసెర్చ్ అండ్‌ డెవలప్‌మెంట్, లేటెస్ట్ ఇన్నోవేషన్స్ అన్నీ దండగేగా. అందులోనూ యూత్‌లో రిస్క్‌ తీసుకునే కల్చర్ ఎక్కువగా ఉంటుంది. స్టార్టప్‌ కావొచ్చు, మరేదైనా బిజినెస్ కావొచ్చు.. రిస్క్‌ తీసుకుని ముందుకు వెళ్తేనే ప్రాఫిట్స్ వస్తాయి. అమ్మో రిస్క్‌ ఎందుకు అని భయపడితే.. అలాగే ఉండిపోతారు. సో, యూత్‌ లేని దగ్గర ఈ రిస్క్‌ కల్చర్ తగ్గిపోతుంది. అదే జరిగితే.. ఎకానమీపై ఎఫెక్ట్ చూపిస్తుంది.

ఈ ప్రపంచంలో రెండు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి సేవింగ్ ఎకానమీ, రెండోది స్పెండింగ్‌ ఎకానమీ. నిన్న మొన్నటి వరకు ఇండియాది సేవింగ్ ఎకానమి. వచ్చిన దాన్లో ఎంతో కొంత దాచుకోవడమే చూశాం. ఇప్పుడు భవిష్యత్‌పై భయం పోయింది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం లేదిప్పుడు. సో, దాచుకోవడం తగ్గించి కాస్త ఎక్కువ ఖర్చు చేయడం మొదలుపెడుతున్నాం. అమెరికాది ప్యూర్‌గా స్పెండింగ్ ఎకానమి. అక్కడ ఐదు రోజుల పాటు సంపాదించిన డబ్బుని వీకెండ్‌లోని రెండు రోజుల్లో ఖర్చు పెట్టేస్తారు. కారణం.. సోమవారం నుంచి మళ్లీ చేతిలో డబ్బులు పడతాయనే భరోసా. అమెరికా సహా యూరప్‌ దేశాలది స్పెండింగ్ ఎకానమీస్ కాబట్టే.. రెండు ప్రపంచ యుద్ధాలను ఫేస్‌ చేసిన తరువాత కూడా అంతే ఫాస్ట్‌గా డెవలప్‌ అయ్యాయి. అమెరికాను పక్కన పెడితే యూరప్‌ దేశాలు, జపాన్ ఇప్పటికీ స్పెండింగ్‌ ఎకానమీసే. కాకపోతే.. అక్కడ కొనే యూత్‌ లేరు. వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో.. ఉన్న దాంతోనే సంతృప్తిపడడం ఎక్కువైపోయింది. సో, ఖర్చు పెట్టడం తగ్గిపోయింది. ఎక్కడైతే ఖర్చుపెట్టడం తగ్గుతుందో, ప్రాడక్ట్స్‌ సేల్స్‌ తగ్గుతాయో.. ఇక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతున్నట్టే అర్థం. ప్రస్తుతం జపాన్‌లో ఆ పిరియడే నడుస్తోంది. చైనాలో త్వరలో అలాంటి సిచ్యుయేషన్ రాబోతోంది.

ఇక ఫిన్లాండ్. ప్రపంచంలోనే ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్న దేశాల్లో టాప్‌లో ఉంటుందది. నేరాలు లేని దేశం కూడా. ఎంత సంతోషమయమైన దేశం అయితే మాత్రం ఏం లాభం..! యూత్ లేరక్కడ. యునైటెడ్ నేషన్స్ ప్రకారం 2030 నాటికి ఫిన్లాండ్ దేశంలోని 47 శాతం మందికి పైగా ప్రజలు 65 సంవత్సరాలు దాటుతారు. అంటే.. దేశంలో సగానికి సగం వృద్ధులే. ప్రపంచ మొత్తం మీద జపాన్ తర్వాత 65 సంవత్సరాలు దాటిన వారు ఎక్కువగా ఉన్న దేశం ఫిన్లాండ్. ఇక కొరియా కూడా టెక్నాలజీలో అప్‌గ్రేడెడ్‌ కంట్రీనే. అక్కడ కూడా యూత్‌ తగ్గిపోతోంది. యూత్ తగ్గుతోంది అనడం కంటే.. అసలు పిల్లల్ని పెద్దగా కనడమే లేదు అని చెప్పుకోవాలేమో. ముగ్గురు చనిపోతుంటే ఒకరు పుడుతున్నారు. కొరియాతో పాటు జపాన్‌, చైనాలోనూ పెళ్లి, పిల్లలపై ఇంట్రస్టే కనిపించడం లేదు అక్కడి యువతకి. ఏమంటే.. సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నారు. పెళ్లి చేసుకుంటే.. ఫ్యామిలీ బర్డెన్‌ మోయాలి, వాళ్ల కోసం కష్టపడాలి, ఇంకాస్త ఎక్కువ సంపాదించాలి అనే మెంటల్‌ స్ట్రెస్‌లో ఉన్నారు. సో, సింగిల్‌గా ఉన్నంత ఉత్తమం లేదనుకుంటున్నారు. అక్కడి ఆడవాళ్లు కూడా అదే మైండ్‌సెట్‌తో ఉన్నారు. పిల్లల్ని కనాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, బండెడు చాకిరీ చేయాలి. అదే పెళ్లి చేసుకోకపోతే.. లైఫ్‌ అంతా సింగిల్‌గా ఉంటూనే ఎంజాయ్‌ చేయొచ్చు అని ఫీలవుతున్నారు. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే.. చైనా, జపాన్‌లో ఇప్పుడు కనిపిస్తున్న డెవలప్‌మెంట్‌ అంతా ఆగిపోతుంది. అభివృద్ధి తగ్గిపోతుంది కూడా. ఎందుకంటే.. టెక్నాలజీపైనా, రీసెర్చ్‌పైనా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పైనా పెట్టాల్సిన ఇన్వెస్ట్‌మెంట్‌ని.. భవిష్యత్తులో హాస్పిటల్స్ కోసం, ఓల్డ్‌ ఏజ్ హోమ్స్‌ కోసం, వారికి ఇవ్వాల్సిన పెన్షన్స్‌ కోసం, హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ కోసం పెట్టాల్సి వస్తుంది. కొన్ని స్టాటిస్టిక్స్‌ చూద్దాం. జపాన్‌లో డ్రైవర్ల సగటు వయసు 59 ఏళ్లు. కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్న వారి సగటు వయసు 60 ఏళ్ల పైనే. వ్యాపారాలు చేస్తున్న వారి సగటు వయసు 70 ఏళ్లు. ఇలా ఏ రంగంలో చూసినా జపాన్‌లో అంతా వృద్ధులే. ఇంతమంది వృద్ధులు ఉంటే.. ఇక ఆ దేశం ఎంత రిచ్‌ కంట్రీ అయితే ఏం లాభం. ఐఫోన్లు, 6జీ ఫోన్లు, ప్లేస్టేషన్స్.. ఇవేవీ వాడరు కదా. చేతిలో ఓ నార్మల్‌ ఫోన్‌ ఉంటే చాలు అని సర్దుకుపోతారు. అందుకే, జపాన్ ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతోంది. ఎకానమీ సంగతి దేవుడెరుగు.. దేశాల ఎగ్జిస్టెన్సే లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. 2050 నాటికి జపాన్ 40 శాతం జనాభాను కోల్పోయే ప్రమాదం ఉందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2024 జనవరి 1 నాటికి జపాన్ జనాభా 12 కోట్ల 49 లక్షలు. ఇంకేం.. 12 కోట్ల మంది ఉన్నారుగా.. జనాభా పెరగదా అనుకోవచ్చు. పెరగడం లేదనేగా వాళ్ల బాధంతా. గత ఏడాది 7 లక్షల 30వేల మంది పుడితే.. 15 లక్షల 80వేల మంది చనిపోయారు. అంటే.. పుట్టే పిల్లల కన్నా వృద్ధులై చనిపోతున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు జపాన్‌లో.

యూత్‌ ఉంటేనే అన్నీ సాధ్యం అవుతాయా? మధ్యవయసు వాళ్లు, సీనియర్లతో పని జరగదా అంటే.. ఇక్కడా ఓ లెక్క ఉంది. జాబ్‌ మార్కెట్లోకి వచ్చే యూత్‌ను ఓ డైరెక్షన్‌లో నడపాలన్నా, వారితో పనిచేయించాలన్నా.. కచ్చితంగా ఏజ్డ్‌ పర్సన్స్ ఉండాల్సిందే. అంటే, సీనియర్స్ అన్నమాట. ప్లానింగ్‌ మొత్తం పైస్థాయిలో జరుగుతుంది. దట్ మీన్స్.. సీనియర్స్ ప్లాన్ చేస్తారు. కాని, దాని ఎగ్జిక్యూషన్ మాత్రం యంగస్టర్స్‌తో చేయిస్తారు. ఎక్కడైనా ఇదే ప్రాసెస్ నడుస్తుంది. స్టార్టప్స్‌ అయినా సరే.. వాటిలో యూత్ మాత్రమే ఉండరు. కాలేజ్‌ అయిపోగానే సర్టిఫికేట్స్‌తో వచ్చిన వాళ్లందరినీ తీసుకోరు. అందులోనూ ఏజ్డ్‌ పర్సన్స్‌గా పిలిచే సీనియర్స్‌ ఉండాల్సిందే. మైండ్‌లో ప్లాన్ ఉన్నంత మాత్రాన సరిపోదుగా. దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి. సో, సీనియర్స్ కచ్చితంగా ఉండాలి. లేకపోతే.. సిస్టమ్‌లో ఒక బ్యాలెన్స్ అనేది ఉండదు. పైగా అన్నీ టెక్నాలజీతోనే అవవు. సపోజ్‌ ఇజ్రాయెల్‌ ఉంది. టెక్నికల్లీ సౌండ్‌ కంట్రీ అది. కాని, పనిచేసే వాళ్లు లేరక్కడ. అందుకేగా.. పనిచేయగల భారతీయలు ఉంటే పంపించండి అని అడిగింది ఇజ్రాయెల్. ఆ దేశానికి పనిచేసే వాళ్లు 70వేల మంది కావాల్సి రావడంతో ఇండియాతో పాటు ఇతర దేశాల వాళ్లని రిక్వెస్ట్‌ చేసింది. సో, టెక్నాలజీతోనే అన్నీ జరిగిపోవు.

ఇక మన దేశానికి వద్దాం. సౌత్‌ ఇండియా గురించి కాస్త చర్చించుకుందాం. ఒకప్పుడు జనాభా నియంత్రణను పాటించి, విజయవంతంగా పూర్తి చేసింది దక్షిణాది రాష్ట్రాలే. అదే.. ఆనాడు చేసిన తప్పు అని ఇప్పుడు ఫీల్‌ అవుతున్నాయి. చదువుకున్న వాళ్లు ఎవరైనా.. ఒకరు లేదా ఇద్దరు అనే అనుకుంటారు. కేరళ.. అక్షరాస్యతలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన రాష్ట్రం. అందుకే, కేరళ కూడా అదే పని చేసింది. అక్కడ జనాభాను బాగా నియంత్రించారు. 1970’s, 1980’s మధ్య జనాభా నియంత్రణకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఒకరిద్దరు పిల్లల్ని కంటే చాలు అంటూ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో జనం కూడా అదే ఫాలో అయ్యారు. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక.. ఇలా రాష్ట్రాలన్నీ జనాభాను నియంత్రించాయి. అప్పుడు అలా చేసిన కారణంగా.. ఇప్పుడు వృద్ధుల సంఖ్య వేగంగా పెరిగే రాష్ట్రాలుగా మిగలబోతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. అందుకే, కేరళ సైతం జనాభాను పెంచేస్తామనే అంటోంది. దానికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన వాటా కూడా జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ కాబట్టి.. నిధులు కూడా ఆ రాష్ట్రాలకే ఎక్కువగా వెళ్తున్నాయి. సో, మనం మాత్రం జనాభాను ఎందుకు నియంత్రించాలి.. పెంచితే పోలా అనుకుంటున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. పైగా జనాభాను నియంత్రించిన కారణంగా.. రాజకీయంగానూ దక్షిణాది రాష్ట్రాల బలం పడిపోబోతోంది. 2026 తరువాత ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుతారు. అది కూడా జనాభా ప్రకారం పెంచుతారు. అంటే.. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎంపీ సీట్ల తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు.. జీడీపీ వాటా కూడా తగ్గుతుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ సంచలన ప్రకటన చేశారు. ‘ప్రతి ఒక్క జంట.. 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు’ అని ప్రశ్నించారాయన. ‘కొత్తగా పెళ్లయిన జంటలకు 16 రకాల ఆస్తులను పొందాలని పూర్వం పెద్దలు ఆశీర్వాదించేవారు. ఇప్పుడు ఆస్తికి బదులుగా 16 మంది పిల్లలను కనాలని, వారు ఆనందంగా జీవించాలని దీవించండి అంటున్నారు సీఎం స్టాలిన్. సీఎం స్టాలిన్‌ది ఆవేశం కాదు.. ఆవేదన. జనాభా నియంత్రణ విధానాలు పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోయి, నిధుల కేటాయింపులో కోత పడుతోందన్న ఆవేదన.

సో.. సీఎం చంద్రబాబు నినాదం కూడా అదే. యువ ఆంధ్రా కావాలి. అలా జరగాలంటే.. పిల్లల్ని కనాలి. అందుకే, సీఎం చంద్రబాబు తాజాగా ఈ నినాదం అందుకున్నారు. మరోవైపు మనుషుల ఆయుర్ధాయం కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో.. రాబోయే కాలంలో పిల్లల్ని కనకపోతే ముసలివాళ్లే మిగులుతారని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. జనాభా పెంచాలనే ఈ నినాదానికి ఆంధ్రాతో పాటు కేరళ కూడా గొంతు కలుపుతోంది. ఫైనల్‌గా.. ఒక్క విషయం. యువత సంఖ్య పెరగాలనుకుంటున్నంత మాత్రాన మధ్యవయసు వాళ్లు, వృద్ధులు వద్దని కాదు దాని అర్థం. ఇద్దరి సంఖ్యా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది. ఆ బ్యాలెన్స్ తప్పంది కాబట్టే జపాన్ వృద్ధ జపాన్‌ అయింది. చైనా, కొరియాలో పిల్లల్నే కనడం లేదు. ఆ పరిస్థితి మనకు వద్దు అనేదే థీమ్ తప్పితే.. యూత్‌ మాత్రమే పెరగాలనే ధోరణి కాదు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో