AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Place: నదులు కలిసిన చోట మన దేశం.. ఇది గ్రాఫిక్ మాయ కాదు.. నిజమైన ప్రదేశమే.. ఇంత అందమైన ప్రాంతం ఎక్కడుందంటే..

సోషల్ మీడియాలో కనిపించే కొన్ని పోస్ట్ లు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. ఒక్కోసారి ఆ పోస్ట్ లకు జత చేసిన ఇమేజ్ మన మనసులో చెరగని ముద్ర వేస్తుంది.

Special Place: నదులు కలిసిన చోట మన దేశం.. ఇది గ్రాఫిక్ మాయ కాదు.. నిజమైన ప్రదేశమే.. ఇంత అందమైన ప్రాంతం ఎక్కడుందంటే..
Special Place
KVD Varma
|

Updated on: Nov 27, 2021 | 11:58 AM

Share

Special Place: సోషల్ మీడియాలో కనిపించే కొన్ని పోస్ట్ లు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. ఒక్కోసారి ఆ పోస్ట్ లకు జత చేసిన ఇమేజ్ మన మనసులో చెరగని ముద్ర వేస్తుంది. ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన విశేషాలు చూస్తే మనసు ఆనందంతో పొంగిపోతుంది. అటువంటిదే ఈ పోస్ట్ కూడా. ఒక నెటిజన్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో ఉంచిన పోస్ట్ చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది. అందులో ఉన్న ఫోటో చూస్తె అక్కడకు వెంటనే వెళ్లి దానిని చూసిరావాలనిపిస్తుంది. నదుల మధ్యలో పచ్చగా మెరిసిపోతున్న మన దేశపు ఆకృతి మనకు తెలియకుండానే మనల్ని మరో ప్రపంచానికి తీసుకుపోతుంది.

ఇది అస్సాంలోని ఒక ప్రత్యేకమైన ప్రదేశం. బొంగైగావ్ (అస్సాం) సమీపంలో బ్రహ్మపుత్ర నదిలో చంపాబాతి నది కలుస్తున్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని చూస్తె, మన దేశ పటంలా కనిపిస్తుంది. దీనిని చూస్తే మీరందరూ ఇంతకు ముందెన్నడూ చూడని భౌగోళిక శాస్త్రంలో ఇది చాలా అద్భుతమైన విషయం అని అంటారు. దీనిని అస్సామీలో ‘చపోరి’ అని పిలుస్తారు.

ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మీరందరూ ఈ ఫోటోను ఎరిక్ సోల్హీమ్ పేజీలో చూడవచ్చు. ఆయన ఈ నది చిత్రాన్ని పంచుకున్నారు. అందులో భారతదేశం మ్యాప్ కనిపిస్తుంది. ఫోటోను పంచుకుంటూ, అతను చాలా అందమైన క్యాప్షన్ కూడా పెట్టాడు. ”అస్సాంలోని బొంగైగావ్‌లో చంపావతి నది బ్రహ్మపుత్రలో కలిసే ప్రదేశం ఉంది. ఇది సరిగ్గా భారతదేశం మ్యాప్ లాగా ఉంది. అద్భుతమైన మరియు అందమైన భారతదేశం!” అంటూ ఆయన దీనికి క్యాప్షన్ ఇచ్చారు. ఆ పోస్ట్ మీరూ చూసేయండి..

అతని ఈ పోస్ట్‌ని అందరూ చాలా ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ ఫోటోపై తమ స్పందనలను పంచుకుంటున్నారు. అతని ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి, అలాగే వేలాది మంది తమ స్పందనను కూడా పంచుకున్నారు. ఒక వినియోగదారుపై వ్యాఖ్యానిస్తూ, ‘నాకు అంత పరిజ్ఞానం లేనందున నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతాను. కానీ మీ ట్వీట్ ద్వారా భారతదేశం గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.’ అని రాసారు. మరొక వినియోగదారు, ‘ప్రకృతి అందంగా ఉంది’ అని మురిసిపోయారు. మరొకరు వ్యాఖ్యానిస్తూ, ‘ఇది చాలా అందమైన దృశ్యం, ప్రతి భారతీయుడు ఈ స్థలాన్ని ఒకసారి సందర్శించాలని నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ప్రజలు ఈ చిత్రంపై ఎమోటికాన్‌లను కూడా షేర్ చేస్తున్నారు.

ఇంతకు ముందు ఎరిక్ సోల్హీమ్ మరొక చిత్రాన్ని పంచుకున్నారు. అందులో ఒక నది కనిపించింది. మీరు ఆ నది లోపలి భాగాన్ని చూడగలిగేంత స్పష్టంగా ఉంది. అంటే ఆ నదిలో నీరు అంత పరిశుభ్రంగా ఉంది. ఈ నదిలో కింద రాళ్లు మరియు చెట్లు హాయిగా కనిపిస్తాయి. ఈ నదిని చూడగానే గాలిలో పడవ కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఈ నది గాజులా కనిపిస్తుంది. ఆ చిత్రాన్ని పంచుకుంటూ, అతను క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు, ‘ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన నదులలో ఒకటి భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఉమాంగోట్ నది గాలిలో పడవలా కనిపిస్తోంది. నీరు చాలా స్పష్టంగా ఉంది. అన్ని నదులు శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను.’

ఇవి కూడా చదవండి: Tomato Price: దక్షిణాదిలో కాస్త తగ్గిన టమాటా ధర.. అక్కడ మాత్రం అదిరిపోయే రేంజిలోనే.. ఎక్కడ ఎంత రేటు ఉందంటే.. 

Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..