India Corona: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. స్వల్పంగా పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ

India Corona: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. స్వల్పంగా పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 20, 2022 | 9:57 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఐదు వేలకు దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య రెండు వేలకు దిగువన నమోదైంది. దేశవ్యాప్తంగా శనివారం 1,761 కరోనా కేసులు ( Coronavirus ) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 127 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య తగ్గగా.. మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.56 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 26,240 (0.06%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,07,841 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,16,479 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 3,196 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,24,65,122 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.74 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,81.21 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా నిన్న 4,31,973 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వాటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 78.26 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

Also Read:

Telangana: యువతిని వెంటాడిన పాము.. ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. అసలేమైందంటే..?

AP Crime News: చిత్తూరు టు భీమిలి.. వయా గుంటూరు.. పసిబిడ్డ కిడ్నాప్ కథ సుఖాంతం..

Chicken: భార్య చికెన్ వండలేదని డయల్ 100కు ఫోన్.. పోలీసులు ఏం చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే..