Gold Reserves: బంగారం నిల్వలు ఏ దేశం దగ్గర ఎక్కువ ఉన్నాయి.. భారత్ కొత్తగా ఎంత గోల్డ్ కొందంటే..
Gold Reserves: ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా డేటా ప్రకారం.. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితుల(Global Volatilities) కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు(Central Banks) వద్ద ఉన్న బంగారు నిల్వల వివరాలు తెలుసుకోండి.
Gold Reserves: ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా డేటా ప్రకారం.. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితుల(Global Volatilities) కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు(Central Banks) తమ వద్ద ఉన్న బంగారు నిల్వలను అమ్ముతున్నాయి. 2010 తరువాత సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉండే బంగారాన్ని అమ్మటం ఇదే మెుదటిసారని తెలుస్తోంది. ఈ అమ్మకాల ప్రక్రియ జనవరి నెలలోనూ కొనసాగింది. జనవరి మాసంలో బంగారం కొనుగోళ్లు 13 టన్నులకంటే తక్కువకు పడిపోయాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఔన్సు బంగారం ధర 2000 డాలర్ల మార్కును దాటిన క్రమంలో ఈ మార్పు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. కజకిస్తాన్ అమ్మకాల కారణంగా బంగారం నిల్వలు తగ్గుముఖం పట్టాయి. రష్యా, పోలాండ్, ఉజ్బెకిస్తాన్, మంగోలియా వంటి ఇతర దేశాలలో కూడా జనవరిలో బంగారం నిల్వలు అంతకుముందుకంటే పడిపోయాయి.
బంగారం అత్యధికంగా మైనింగ్ చేసే దేశాల్లో కజకిస్తాన్ అతిపెద్దది. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఎక్కువగా స్థానిక బంగారాన్ని కొనుగోలు చేస్తుంటుంది. యుద్ధం కారణంగా అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరోపియన దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించటంతో.. ఇకపై తాము స్థానికంగా బంగారాన్ని కొనుగోలు చేయనున్నట్లు రష్యా ప్రకటించింది.
సెంట్రల్ బ్యాంకుల నిల్వల నిర్వహణ విషయంలో బంగారానికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులకు గోల్డ్ రిజర్వ్స్ హోల్డింగ్ చాలా ముఖ్యమైనవి. IMF IFS వివరాల ప్రకారం వివిధ దేశాల బంగారం నిల్వల వివరాలు ఒకసారి గమనిద్దాం. టర్కీ 10 టన్నులు, భారత్ ఒక టన్ను బంగారాన్ని కొన్నాయి. వరుసగా 12 నెలలో భారతదేశం బంగారాన్ని కొనుగోలు చేసింది. దీని వల్ల ప్రస్తుతం భారత సెంట్రల్ బ్యాంక్ వద్ద గోల్డ్ రిజర్వ్స్ 755 టన్నులకు చేరుకున్నాయి. ఖతార్ 0.7 టన్నులు, ఐర్ లాండ్ 0.5 టన్నులు చొప్పున జనవరిలో బంగారాన్ని కొన్నాయి.
ఇదే సమయంలో కజికిస్తాన్ 17 టన్నులు, రష్యా 3 టన్నులు, పోలాండ్ 2 టన్నులు, ఉజ్బెకిస్తాన్ 1 టన్ను, మంగోలియా 1 టన్ను బంగాన్ని జనవరిలో అమ్మటం జరిగింది.
ఇవీ చదవండి..
Tax on Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై టాక్స్ ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి..
Tata Motors: తగ్గేదే లే అంటున్న టాటా మోటార్స్.. ఇటు రోడ్లపైనా.. అటు స్టాక్ మార్కెట్లోనూ..!