India – China: ఆగని చైనా దుశ్చర్యలు.. భారత్‌పై డ్రాగన్ నిఘా.. కీలక క్షిపణి పరీక్ష వాయిదా..!

డ్రాగన్‌ కవ్వింపులు మళ్లీ పెరిగాయి. భారత క్షిపణి ప్రయోగాలు.. ఉపగ్రహాల కదలికలపై చైనా నిఘా పెట్టింది. భారత్‌ అభ్యంతరాలను పట్టించుకోకుండా.. చైనాకు చెందిన ఓ నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-6 హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించింది.

India - China: ఆగని చైనా దుశ్చర్యలు.. భారత్‌పై డ్రాగన్ నిఘా.. కీలక క్షిపణి పరీక్ష వాయిదా..!
Chinese Spy Ship
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 05, 2022 | 3:00 PM

డ్రాగన్‌ కవ్వింపులు మళ్లీ పెరిగాయి. భారత క్షిపణి ప్రయోగాలు.. ఉపగ్రహాల కదలికలపై చైనా నిఘా పెట్టింది. భారత్‌ అభ్యంతరాలను పట్టించుకోకుండా.. చైనాకు చెందిన ఓ నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-6 హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించింది. భారత్‌ కీలక క్షిపణి ప్రయోగం చేపట్టడానికి కొద్ది రోజుల ముందు చైనా ఈ కవ్వింపులకు పాల్పడింది. నవంబరు 10-11న ఓ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహిస్తునట్టు భారత్‌ నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌) జారీ చేసింది. ఒడిశా తీరంలోని అబ్దుల కలాం దీవి నుంచి ఈ ప్రయోగం చేపడుతామని ప్రకటించారు. 2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి పయనం.. శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. అయితే ఈ నోటీసు జారీ చేసిన కొద్ది రోజులకే చైనాకు చెందిన యువాన్‌ వాంగ్‌-6 అనే నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించింది. దీంతో బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షను వాయిదా వేయాలని భారత రక్షణశాఖ నిర్ణయించింది.

హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిన చైనా నిఘా నౌక కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఇండియన్‌ నేవీ ప్రకటించింది. ఈ నౌక ఇండోనేషియాలోని బాలీ తీరం నుంచి బయల్దేరింది. ఇది పరిశోధనా నౌక అని డ్రాగన్‌ చెబుతున్నప్పటికీ.. దీనికి క్షిపణి పరీక్షలు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఉంది. భారత్‌పై చైనా ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఈ నౌక కదలికలకు స్పష్టం చేస్తున్నాయి.

ఆగస్టులో కూడా చైనా నేవీకి చెందిన నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 శ్రీలంకలోని హంబన్‌టోట రేవులో లంగరేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. భారత్‌ అభ్యంతరాలను పట్టించుకోకుండా లంక ప్రభుత్వం ఆ నౌకను అనుమతించింది. ఆగస్టు 16-22 వరకు ఈ నౌక హంబన్‌టోట రేవులో ఆగింది. రుణాలను తిగిరి చెల్లించలేకపోవడంతో ఈ రేవును శ్రీలంక.. చైనాకు 99ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా.. ఇది పరిశోధనా నౌక అంటూ డ్రాగన్‌ చెబుతున్నప్పటికీ.. దీనికి క్షిపణి పరీక్షలు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఉన్నట్లు అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను హిందూ మహా సముద్రంలోకి పంపించడంతో.. చైనా వక్రబుద్ధి మరోసారి బయటపడినట్లయింది. క్షిపణి పరీక్ష వేళ కావాలనే చౌనా నౌకను మోహరించిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?