AK 103 Guns: 70 వేల ఏకే-103 గన్స్‌కు భారత్ ఆర్డర్.. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు రష్యాతో కీలక ఒప్పందం

ఇండియా, చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ పొడవునా ఏర్పడ్డ ఉద్రిక్తతల అనంతరం భారత సైన్యం అత్యవసరంగా ఆధునిక ఆయుధాల కొనుగోలు కోసం ప్రయత్నాలు పారరంభించింది.

AK 103 Guns: 70 వేల ఏకే-103 గన్స్‌కు భారత్ ఆర్డర్.. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు రష్యాతో కీలక ఒప్పందం
Ak 103 Guns
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 28, 2021 | 8:43 PM

AK-103 assault rifles: ఇండియా, చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ పొడవునా ఏర్పడ్డ ఉద్రిక్తతల అనంతరం భారత సైన్యం అత్యవసరంగా ఆధునిక ఆయుధాల కొనుగోలు కోసం ప్రయత్నాలు పారరంభించింది. ఆయుధాలు కొనాలంటే ఏళ్లు గడిచిపోతున్నాయి. నిపుణుల కమిటీల పరిశీలనలు, అంతర్జాతీయ మార్కెట్ లో టెండర్లు. ఇంతలో దళారుల రంగ ప్రవేశం. ముడుపులు. కుంభకోణాలు. ఇది మన సైనిక దళాల అనుభవం. ఈసారి వేల కోట్ల రూపాయల ఆధునిక ఆయుధాల కొనుగోళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ సైనికాధికారులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే సాయుధ దళాలకు ఆయుధాలు సమకూర్చే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్‌ గతంలోనే ఆయుధాల కొనగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఆపరేషనల్ ఎమర్జెన్సీ కోసం ఎయిర్ ఫోర్స్‌కు కొత్తగా 70 వేల అధునాతన తుపాకులు అందించాలని నిర్ణయించింది. ఇందు కోసం రష్యాతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వాడుతున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో.. 70 వేల ఏకే 103 తుపాకుల కొనుగోలుకు రష్యాకు ఆర్డర్ ఇచ్చింది. అత్యవసరంగా వీటిని కొనుగోలు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. కొన్ని నెలల్లోనే ఈ ఆయుధాలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 300 కోట్లలతో ఈ తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నేవీలోని మెరైన్ కమాండోల దగ్గర ఏకే 103 రైఫిల్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చే రైఫిల్స్ ను జమ్మూకశ్మీర్ లో సెన్సిటీవ్ ఏరియాల్లో పనిచేసే సైనికులకు అందించనున్నారు.

అఫ్ఘానిస్తాన్ – తాలిబన్ పరిణామాల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల చేతికి అత్యాధునిక అమెరికన్ ఆర్మీ ఆయుధాలు చేజిక్కడంతో భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కాశ్మీర్‌ అంశంపై జైష్-ఏ-మహ్మద్ సంస్థ తాలిబన్ నేతలతో చర్చించిన నేపథ్యంలో భారత్ అత్యవసర నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్‌లో భద్రతా బలగాలకు అత్యాధునిక ఏకే-103 రైఫిళ్లను అందించనున్నట్టు ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి. ఇప్పటికే కశ్మీర్ లోయలోని వూలర్ లేక్ వద్ద గస్తీ సిబ్బందికి ఏకే-103 రైఫిళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఏకే-47 రైఫిళ్ల కంటే శక్తివంతమైన, అత్యాధునిక ఆయుధాలుగా ఏకే-103 రైఫిళ్లకు పేరుంది. భారతా బలగాల రక్షణ దృష్ట్యా మొత్తం 1.5 లక్షల రైఫిళ్లు అవసరమని భారత్ అంచనా వేసింది. వీటి దశల వారీగా సమకూర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం 70 వేల ఏకే-103 రైఫిల్స్‌ను అర్డర్ చేసిన భారత్.. మిగిలినవాటిని ఏకే-203 రైఫిళ్లతో భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి.

వీటితో పాటు.. ఏకే 203 రైఫిల్స్ కొనుగోలుకు త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనుంది భారత రక్షణ శాఖ. అయితే, పూర్తిగా స్వదేశంలో వీటిని తయారు చేయనున్నారు. రష్యాతో ఒప్పందం తర్వాత.. దేశంలో ఆర్మీ ఆధ్వర్యంలో వీటిని తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు ఆరున్నర లక్షల ఏకే 203 రైఫిల్స్‌ను రక్షణ శాఖ కొనుగోలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లక్షన్నర అమెరికన్ సిగ్ సార్స్, 16 వేల నెగెవ్ లైట్ మెషిన్ గన్స్.. సైనికులకు అందించారు.

లద్ధాక్‌లో ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా భారత సైన్యం అత్యవసరంగా ఆధునిక ఆయుధాల కొనుగోలు కోసం ప్రయత్నాలు పారరంభించింది. ఆధునిక ఆయుధాలు కొనుగోలు కోసం క్యాపిటల్ బడ్జెట్ నుంచి అవసరమైన నిధులు ఖర్చు చేసే అధికారం ఇప్పుడు భారత సైన్యానికి దక్కింది. గతంలో ఎప్పుడూ సైన్యానికి ఇలాంటి అధికారాలు ఇవ్వలేదు. ఆయుధాల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం నివారించడానికి మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

2016లో కాశ్మీర్‌లోని ఉరి సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి తరువాత కూడా ఆయుధాల కొనుగోలు కోసం సైన్యానికి కొన్ని పరిమిత అధికారాలు ఇచ్చారు. ఆ తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా ఆయుధాల కొనుగోలు కోసం సైన్యానికి మరిన్ని అత్యవసర అధికారాలు కల్పించారు. అత్యవసరంగా ఆయుధాలు కొనుగోలు చెయ్యడానికి సైన్యానికి 7వేల 500కోట్ల రూపాయలు రాజనాథ్ సింగ్ మంజూరు చేశారు. ఈ నిధులతో సైనికాధికారులు 72వేల సిగ్ 716 రకం అసాల్ట్ రైఫిళ్లు కొనుగోలు చేస్తున్నారు. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, ట్యాంకులకు అవసరమైన మందుగుండు కొనుగోలు చేస్తారు. అత్యంత చలి ప్రదేశాల్లో సైనికులు ధరించే ప్రత్యేక దుస్తులు కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వనున్నారు. స్పైస్ బాంబులు , అదనంగా హెరాన్ డ్రోన్లు కొనుగోలు చేయనున్నారు. సైనికుల భుజాలపై నుంచి ప్రయోగించే ఎయిర్ డిఫెన్స్ సిస్టంను కూడా సమకూర్చుకోనున్నారు. అమెరికా, రష్యా , ఇజ్రాయెల్, ఫ్రాన్స్, మరికొన్ని దేశాల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, కేంద్ర రక్షణ శాఖ దశల వారీగా అత్యాధునిక ఆయుధాల కొనుగోలు చేపడుతోంది.

Read Also… Neeraj Chopra: పాకిస్తానీయుల హృదయాలను గెలిచిన నీరజ్ చోప్రా.. నిజమైన ఛాంపియన్‌ మీరేనంటూ పొగడ్తలు.. ఎందుకో తెలుసా?

Telangana Corona Cases: తెలంగాణలో దిగివస్తునన కరోనా కేసులు.. కొత్తగా 325మందికి పాజిటివ్

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..