Farmer found Diamond: పంట పండించకుండానే రాత్రికి రాత్రే లక్షాధికారి అవుతున్న రైతు.. ఆరోసారి వరించిన అదృష్టం!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఒక రైతు పంట పండుతోంది. రెండేళ్లలో ఆరవసారి ఆయన్ను అదృష్టం వరించింది. పన్నా జిల్లాకు చెందిన రైతుకు అధిక నాణ్యత కలిగిన వజ్రం దొరికింది.

Farmer found Diamond: పంట పండించకుండానే రాత్రికి రాత్రే లక్షాధికారి అవుతున్న రైతు.. ఆరోసారి వరించిన అదృష్టం!
Diamond
Follow us

|

Updated on: Aug 28, 2021 | 7:00 PM

Farmer found Diamond: మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఒక రైతు పంట పండుతోంది. రెండేళ్లలో ఆరవసారి ఆయన్ను అదృష్టం వరించింది. పన్నా జిల్లాకు చెందిన రైతుకు అధిక నాణ్యత కలిగిన వజ్రం దొరికింది. ఈసారి ఆయనకు 6.47 క్యారెట్ల నాణ్యత కలిగిన వజ్రం లభించింది. దీంతో మరోసారి ఆ రైతు.. పంట పండించకుండానే లక్షాధికారిగా మారిపోయాడు.

పన్నా జిల్లాలోని జరువాపూర్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ మజుందార్ అనే ప్రభుత్వం నుండి భూమిని లీజుకు తీసుకున్నాడు. ఇందులో తవ్వాలు చేపట్టాడు. 6.47 కారెట్ల బరువు కలిగిన ఈ వజ్రం ఖరీదు ప్రైవేట్‌ వ్యక్తుల అంచనా ప్రకారం సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. రైతు ప్రకాష్‌ మజుందార్‌కి శుక్రవారం పొలంలో వజ్రం దొరికిందని డైమండ్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జ్‌ నూతన్‌ జైన్‌ తెలిపారు. రైతుకి తవ్వకాల్లో మరోసారి వజ్రం దొరికడం మజుందార్ సంతోషాని అవధుల్లేవు. గత రెండేళ్లలో ఆరోసారి తనకు వజ్రం దొరికిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వజ్రాన్ని వేలంలో విక్రయించనున్నామని, ప్రభుత్వ లెక్కల ప్రకారం ధర నిర్ణయించబడుతుందని అన్నారు. పన్నా జిల్లాలోని పొలాల్లో 12 లక్షల కారెట్ల వజ్రాలు ఉంటాయని, ఈ వజ్రాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక రైతులు, కార్మికులకు లీజ్‌కు ఇస్తుంటుందని డైమండ్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జ్‌ నూతన్‌ జైన్‌ తెలిపారు. అనంతరం ఆ డైమండ్స్‌ను జిల్లామైనింగ్‌ అధికారి వద్ద డిపాజిట్‌ చేస్తారని.. వేలం అనంతరం నగదును రైతులకు అందిస్తామని తెలిపారు. వేలంలో వచ్చిన మొత్తం నుండి ప్రభుత్వ పన్నులు, రాయల్టీని మినహాయించి.. మిగిలిన మొత్తాన్ని రైతులకు ఇస్తామని వెల్లడించారు.

కాగా, డైమండ్‌ వేలంలో విక్రయించగా వచ్చిన నగదును మైనింగ్‌లో తనకు సహకరించిన మరో నలుగురితో కలిసి సమానంగా పంచుకుంటామని ప్రకాష్‌ మజుందార్‌ తెలిపారు. గతేడాది 7.44 కారెట్ల విలువ కలిగిన డైమండ్‌ దొరికిందని అన్నారు. అలాగే, నాలుగుసార్లు రెండు నుండి 2.5 కారెట్ల విలువ కలిగిన రాళ్లను వెలికితీశామని అన్నారు.

Read Also…  Gold Bag: ప్రైవేట్ బస్సులో 2 కిలోల బంగారు బ్యాగుతో వచ్చిన వ్యక్తి.. తీరా హైదరాబాద్ చేరుకోగానే షాక్..!