- Telugu News Photo Gallery Business photos Google Apple Deal: Google Said to Pay Apple 15 Billion dollars to Remain Default Search Engine on Safari in 2021
Google Apple Deal: గూగుల్-ఆపిల్ మధ్య కళ్లు చెదిరి డీల్.. లక్షా పదివేల కోట్లతో ఒప్పందం
Google Apple Deal: గూగుల్ .. ఈ పేరు తెలియని వారు ఉండరు. చాలా దేశాల్లో గూగుల్‌దే మొదటిస్థానం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రకాల బ్రౌజర్లు ఉన్నప్పటికీ మనం కొనుగోలు..
Updated on: Aug 28, 2021 | 6:43 PM

Google Apple Deal: గూగుల్ .. ఈ పేరు తెలియని వారు ఉండరు. చాలా దేశాల్లో గూగుల్‌దే మొదటిస్థానం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రకాల బ్రౌజర్లు ఉన్నప్పటికీ మనం కొనుగోలు చేసే మొబైల్ ఫోన్స్ లో మాత్రం గూగుల్ బ్రౌజర్ తప్పకుండా ఉంటుంది. ఏదేదో ఆ మొబైల్ కంపెనీ ఫ్రీగా ఇవ్వదు. ఇందుకోసం కొన్ని కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంటుంది గూగుల్.

తాజాగా ఈ టెక్ దిగ్గజం.. యాపిల్‌తో ఈ ఏడాది కోసం లక్షా పదివేల కోట్లతో ఒప్పందం చేసుకుంది. 2021లో తయారైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌లలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ కోసం15 బిలియన్ల డాలర్ల(లక్షా పదివేల కోట్లకు పైనే) డీల్ కుదుర్చుకుంది గూగుల్. తద్వారా సఫారీ బ్రౌజర్‌లో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌గా పని చేయనుంది.

మైక్రోసాఫ్ట్-బింగ్ పోటీని తట్టుకునేందుకు ప్రతీ ఏడాది ఇలా భారీ డీల్స్ చేసుకుంటూ పోతోంది. గత ఏడాది ఈ ఒప్పందం విలువ పది బిలియన్ల డాలర్లు ఉండగా.. 2019లో 8 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇక వచ్చే ఏడాది ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని, 18-20 బిలియన్ డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు.

అయితే ఇక ఐవోస్ డివైజ్‌లపై యాపిల్-గూగుల్ డీల్ గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విస్తరణకు మిగతా బ్రౌజింగ్ ప్లాట్ ఫామ్స్ కు అవకాశం ఇవ్వాలంటూ యూకే కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ అభిప్రాయపడింది. కాగా భారత మార్కెట్‌పై గూగుల్ ప్రత్యేక దృష్టిసారించింది.

వచ్చే 5-7 ఏళ్లలో ఇండియాలో 1000 కోట్ల డాలర్లు (రూ.75000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్విటీ వాటాల కొనుగోళ్లతో పాటు పలు మార్గాల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు పిచాయ్ గత ఏడాది వెల్లడించిన సంగతి తెలిసిందే.





























