AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హర్యానాలో రైతుల ఆందోళన ఉధృతం..రోడ్లపై మంచాలు వేసుకుని వినూత్న నిరసన

హర్యానాలో అన్నదాతల ఆందోళన ఉధృతమైంది. కర్నాల్ జిల్లాలో తమ తోటి రైతు సోదరులపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా వారు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను దిగ్బంధం చేశారు.

హర్యానాలో రైతుల ఆందోళన ఉధృతం..రోడ్లపై మంచాలు వేసుకుని వినూత్న నిరసన
Farmers Block Highway
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 28, 2021 | 9:47 PM

Share

హర్యానాలో అన్నదాతల ఆందోళన ఉధృతమైంది. కర్నాల్ జిల్లాలో తమ తోటి రైతు సోదరులపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా వారు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను దిగ్బంధం చేశారు. ఢిల్లీ-అమృత్ సర్ హైవేపై..కురుక్షేత్రలో వీరి ఆందోళన ఫలితంగా 3 కిలో మీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. కొంతమంది అన్నదాతలు రోడ్డు మధ్యలో వెదురుకర్రల మంచాలు వేసుకుని వినూత్న నిరసన తెలిపారు. మరికొంతమంది రోడ్డుపై అడ్డంగా బైఠాయించారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన పలువురు రైతులు..కర్నాల్ జిల్లా నుంచి వచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరిలో కొంతమంది రక్తమోడుతున్న గాయాలతోనే ఇక్కడికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. హర్యానా బీజేపీ చీఫ్ ఓ.పి.ధన్ కర్ కాన్వాయ్ ని అడ్డుకోవడానికి యత్నించిన రైతులపై [పోలీసులు లాఠీచార్జి చేశారు. అనేకమందిని అరెస్టు చేశారు. వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ముఖ్యంగా హర్యానాలో కొన్ని నెలలుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ నేతలు హాజరయ్యే ఏ కార్యక్రమాన్ని అయినా అడ్డుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరించింది. అందులో భాగంగానే ధన్ కర్ కాన్వాయ్ ని అడ్డుకోవడానికి రైతులు ప్రయత్నించారు. అన్నదాతల ఆందోళనపై యూపీలోని ఓ వ్యక్తి దాఖలు చేసిన ‘పిల్’ ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు…హర్యానా, యూపీ రాష్ట్రాలతో బాటు కేంద్రాన్ని కూడా తీవ్రంగా మందలించినంత పని చేసింది. రైతుల పరిస్థితిపై మీ వైఖరేమిటని ప్రశ్నించింది. వారు ఇన్ని రోజులుగా రోడ్లపై ధర్నాలు, ప్రదర్శనలు చేస్తుంటే.. మీ ఉదాసీన ధోరణి ఏమిటని.. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని కోర్టు పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: ‘హర్యానాలో చిందిన రైతుల రక్తం’.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్

Visakhapatnam: విశాఖ ఏజెన్సీలో దారుణం.. ఐదేళ్ళ బాలుడిపై కందిరీగల దాడి

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!