‘హర్యానాలో చిందిన రైతుల రక్తం’.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్
హర్యానాలోని కర్నాల్ జిల్లాలో రైతులపై పోలీసుల లాఠీచార్జిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న ఓ రైతు ఫోటోను ఆయన తన ట్వీట్ కి జోడించారు.
హర్యానాలోని కర్నాల్ జిల్లాలో రైతులపై పోలీసుల లాఠీచార్జిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న ఓ రైతు ఫోటోను ఆయన తన ట్వీట్ కి జోడించారు. ‘మళ్ళీ అన్నదాతల రక్తం చిందింది..ఇండియా సిగ్గుతో తలవంచింది’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నేతలతో చర్చించేందుకు సీఎం మనోహర్ లాల్ ఖట్టబస్తారా టోల్ ప్లాజాకు వెళ్తుండగా.. శాంతియుతంగా నిరసన తెలపాలని రైతులు భావించారని. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ ధన్ కర్ కాన్వాయ్ ని వారు అడ్డుకోవడానికి యత్నించడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారని తెలిసింది. పలువురు రైతులను వారు అరెస్టు చేశారు. కాగా-లాఠీఛార్జిని ఖండిస్తూ.. అరెస్టు చేసినవారిని విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అన్నదాతలు ఆందోళనలు చేశారు.
అటు-హర్యానా కాంగ్రెస్ చీఫ్ కుమారి షెల్జా కూడా రైతులపై పోలీసుల దమనకాండను ఖండించారు. ‘కర్నాల్ జిల్లా మేజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా..రైతుల తలలు పగులగొట్టండి అంటూ పోలీసులను ఆదేశించడాన్ని తాను వీడియోలో చూశానంటూ ఆ వీడియోను ఆమె షేర్ చేశారు. అయితే తమ ఆందోళనను ఇంకా ఉధృతం చేస్తామని.. ఈ పోలీసుల లాఠీలు తమను ఏమీ చేయలేవని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు హెచ్చరించారు. ఇక పంజాబ్ లో కూడా రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఆందోళనలో తమతో చేతులు కలుపుతారని వారు వెల్లడించారు. వివాదాస్పద మూడు రైతు చట్టాలను కేంద్రం రద్దు చేయాలన్న తమ డిమాండులో మార్పేమీ లేదని వారు చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఆగండి.. మీ పాత పెట్రోల్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చేయండి.. ఫుల్ ఛార్జ్‌లో 65 కిమీ.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
మీకు పీఎఫ్ ఖాతా ఉందా..? సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు తెలుసుకోండి