Digital Payments: అత్యధికంగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్న దేశం ఏదో తెలుసా ?
ఈ మధ్య కాలంలో ప్రజల చేతిలో కరెన్సీ నోట్లు ఉండటం చాలావరకు తగ్గిపోయింది. చిన్న కిరాణ కొట్టు నుంచి సూపర్ మార్కెట్ దాక డిజిటల్ చెల్లింపులనే వినియోగిస్తున్నారు. అలాగే షాపింగ్ మాల్స్‌కి వెళ్లినా, బయట షికారుకి వెళ్లినా..ఇలా ఏ చోటుకి వెళ్లినా అక్కడ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి.
ఈ మధ్య కాలంలో ప్రజల చేతిలో కరెన్సీ నోట్లు ఉండటం చాలావరకు తగ్గిపోయింది. చిన్న కిరాణ కొట్టు నుంచి సూపర్ మార్కెట్ దాక డిజిటల్ చెల్లింపులనే వినియోగిస్తున్నారు. షాపింగ్ మాల్స్, హోటల్స్, వినోదం.. ఇలా ఏ చోటుకి వెళ్లినా అక్కడ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా వీటి వాడకం మరింత పెరుగుతుందని పలువురుు నిపుణుల చెబుతున్నారు. అయితే డిజిటల్ చెల్లింపుల పరంగా చూస్తే ప్రపంచంలో అత్యధికంగా భారతీయులే ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు మైగవ్ ఇండియా గణాంకాలు తెలిపాయి. 2022లో భారత్‍లో 8,950 కోట్ల లావాదేవిలు జరిగినట్లు సమాచారం
ప్రపంచం మొత్తంగా జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో భారత్ వాటా 46 శాతం ఉన్నట్లు గణాంకాల అధ్యయనంలో తెలిసింది. భారత్ తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల డిజిటల్ లావాదేవీలు మొత్తం కలిపినా ఇంతకంటే తక్కువగానే ఉన్నాయి. లావాదేవీల సంఖ్యాపరంగానే కాదు విలువపరంగా కూడా కొత్త మైలురాళ్లను భారత్ అందుకుందని ఆర్‌బీఐ నిపుణులు తెలిపారు. ఇక డిజిటల్ చెల్లింపుల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఈ దేశంలో గతేడాది 29.2 బిలియన్ డిజిటల్ లావాదేవీలు జరిగాయి. మూడో స్థామంలో చైనా ఉండగా.. థాయ్‌లాండ్, దక్షిణ కొరియా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..