Sachin Pilot: రాజకీయాల్లో అవినీతిపై రాజీపడే ప్రసక్తే లేదు.. గెహ్లాట్‌పై మరోసారి విరుచుకుపడ్డ సచిన్ పైలట్
గతంలో బీజేపీ సర్కార్ చేసిన అవినీతిపై దర్యాప్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తన పోరాటానికి రాజస్థాన్ ప్రజల మద్దతు ఉందన్నారు సచిన్ పైలట్. అందుకే సొంత ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తునట్టు చెప్పారు. రాజకీయాల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం తన తండ్రి నుంచే వచ్చిందన్నారు.
రాజస్థాన్ అశోక్ గెహ్లాట్‌ను మరోసారి టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి సందర్భంగా దౌసాలో బలప్రదర్శన చేశారు సచిల్ పైలట్. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికి న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఆదివారం ఉదయం తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేస్తారనే ఊహాగానాల మధ్య ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన తన సొంత పార్టీ లేదా తన భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించవచ్చనే తీవ్రమైన ఊహాగానాల మధ్య ఆ కార్యక్రమానకి ప్రధాన్యత నెలకొంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో బీజేపీ సర్కార్ చేసిన అవినీతిపై దర్యాప్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తన పోరాటానికి రాజస్థాన్ ప్రజల మద్దతు ఉందన్నారు సచిన్ పైలట్. అందుకే సొంత ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తునట్టు చెప్పారు. రాజకీయాల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం తన తండ్రి నుంచే వచ్చిందన్నారు. దేశంలోని యువత సంక్షేమం గురించి తాను ఎప్పుడూ మాట్లాడతానని పేర్కొన్న పైలట్, “పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నేను చాలా కృతజ్ఞతలు” అని అన్నారు.
దౌసాలో రాజేశ్ పైలట్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సచిన్ పైలట్. ఈ సందర్భంగా తన మద్దతుదారులతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వసుంధరారాజే సర్కార్ చేసిన అవినీతిపై సీఎం అశోక్ గెహ్లాట్ దర్యాప్తు చేయించాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు సచిన్ పైలట్. సచిన్ పైలట్ సొంత పార్టీ పెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు నచ్చచెప్పడానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సమయం చిక్కినప్పుడల్లా సీఎం గెహ్లాట్ తీరుపై విరుచుకుపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం