India Coronaviursu: భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు.. ఒక్క రోజే 4 లక్షలు దాటిన కేసులు

India Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదవుతూనే..

India Coronaviursu: భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు.. ఒక్క రోజే 4 లక్షలు దాటిన కేసులు
India Corona
Follow us
Subhash Goud

|

Updated on: May 06, 2021 | 11:01 AM

India Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 4 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 4,12,262 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3,980 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకే భారత్‌ 2,10,77,410 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మరణాలు 23,01,168 నమోదయ్యాయి. ఇక ఒక్క రోజే 3,29,113 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రికవరీ కేసులు 1,72,80,884 ఉన్నాయి. యాక్టివ్‌ కేసులు 35,66,398 ఉండగా, ఇప్పటి వరకు మొత్తం దేశ వ్యాప్తంగా 16,25,13,339 మందికి వ్యాక్సిన్‌ వేశారు.

కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు, మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.

ఇవీ చదవండి:

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు.. అత్య‌ధిక కేసులు న‌మోదైన‌ జిల్లాలు ఇవే

Covid Third Wave: కోవిడ్ మూడో దశ రాబోతోంది.. ఎదుర్కొనేందుకు సిద్దంకండి: కేంద్ర ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌